కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవదు: శశిథరూర్‌ | Congress MP Shashi Tharoor Interesting Comments On BJP Kerala Fate | Sakshi
Sakshi News home page

కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవదు: శశిథరూర్‌

Apr 9 2026 1:09 PM | Updated on Apr 9 2026 1:19 PM

Congress MP Shashi Tharoor Interesting Comments On BJP Kerala Fate

తిరువనంతపురం: కేరళలో బీజేపీ భవితవ్యంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎన్నటికీ అధికారంలోకి రాలేదని అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. 

కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. ఆ పార్టీ అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేయదు. అసలు ఆ పార్టీ ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపించబోదు. ఇక్కడ పోటీ ఎల్డీఎఫ్‌-యూడీఎఫ్‌ మధ్యే ప్రధానంగా ఉండబోతోంది. విజయన్‌ పాలనలో కనీసం ఇళ్లు కూడా నిర్మించలేకపోయారు. భారీగా పోలింగ్‌ నమోదు అవుతోంది. దీనిని మా యూడీఎఫ్‌ అధికారానికి సంకేతంగా భావిస్తున్నా అని అన్నారాయన. 

2011లో తమ ప్రభుత్వానికి కేరళ ప్రజలు అధికారం ఇచ్చారని.. ఆ సమయంలో తక్కువ మెజారిటీ దక్కిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం భారీ మెజారిటీతో అధికారం కట్టబెడతారని ఆశిస్తున్నట్లు తెలిపారాయన. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement