
లోక్‌సభ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళిక.. పార్లమెంట్, అసెంబ్లీ, పోలింగ్ బూత్‌స్థాయిలో కమిటీలు
బూత్ కమిటీల్లో కీలకంగా పనిచేసే వారికే ఇందిరమ్మ కమిటీల్లో ప్రాధాన్యం
అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం మూడంచెల్లో సమన్వయం చేసుకునే విధంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల వారీగా, పోలింగ్ బూత్‌స్థాయిలో ఈ కమిటీలను నియమించి, సమన్వయంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అందుబాటులో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్య నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయా లని, బాధ్యతలు పంచుకోవడంతో పాటు కార్యకర్త లకు వెన్నంటి నిలవాలని సూచించారు. గత ఎన్ని కల్లో విజయతీరాన్ని చేర్చిన మల్కాజిగిరి మోడ ల్‌ను రాష్ట్రమంతటా అనుసరించాలని నిర్దేశించారు.
ఒకట్రెండు రోజుల్లో కమిటీలు
లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థాయిల్లో నియమించనున్న కమిటీలను ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఏఐసీసీ పరిశీల కులతో పాటు ఆ నియోజకవర్గంలోని ముఖ్యనేత లు సభ్యులుగా ఉంటారు. ఆ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే, లేదంటే నియోజకవర్గ ఇన్‌చార్జ్, మండలాల వారీగా ముఖ్యనేతలు ఉంటారు. ఇక, పోలింగ్‌బూత్ స్థాయిలో నియమించే కమిటీల్లో ప్రతి బూత్ నుంచి ఐదుగురు చురుకైన కార్యకర్తలకు అవకాశం కల్పిస్తారు. ఈ కమిటీ సభ్యులకే ఓట్లు వేయించే బాధ్యత కూడా అప్పగి స్తారు.
ప్రతి బూత్‌లో వచ్చే ఓట్లను బూత్ కమిటీ సభ్యుల పనితీరుకు ప్రాతిపదికగా తీసుకొని త్వర లో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక పర్య వేక్షణ బాధ్యతలను ఈ ఇందిరమ్మ కమిటీలకే అప్ప గిస్తారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్‌స్థాయిలో నియమించే ఐదుగురు సభ్యుల పనితీరు కీలకం కానుంది.
సన్నాహక సమావేశాలు
లోక్‌సభ ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ఆయా పార్ల మెంట్ నియోజక వర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులతోపాటు అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొంటారు. ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ స్థాయిలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూ హం నిర్ణయిస్తారు.