
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయటపెట్టారు. తాను ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పైగా ఇది నా ప్రామిస్ అంటూ నొక్కి మరీ చెప్పారు.
‘‘చంద్రన్న ఉన్నంత వరకు రైతు భరోసా లేదు.. ఉండదు.. రాబోదు’’ అంటూ చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అర్థమైన రైతులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బాబు నిజస్వరూపం బయటపెట్టారంటూ చర్చ మొదలు పెట్టారు.
శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే టంగ్ స్లిప్ అయ్యారో ఏమోగానీ.. తన మనసులో మాటే ఆయన బయటపెట్టారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు .. ఉండదు.. ఉండబోదు🤣🤣#ChandraBabu #ChandraBabuFailedCM #APNotInSafeHands #AndhraPradesh pic.twitter.com/qcbRpArzju
— Jaganaithene Chesthadu (@Jaganaithene) August 2, 2025