సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్వల్పవిరామం తర్వాత తిరిగి గురువారం నుంచి బీఆర్‌ఎస్ నిర్వహించే బహిరంగ సభల్లో పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు పాల్గొంటారు. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తూ బహిరంగ సభల ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఈ నెల 26న నాగర్‌కర్నూలు, 27న స్టేషన్ ఘన్ పూర్‌లో నిర్వహించ తలపెట్టిన సభలను వాయిదా వేస్తున్నట్లు బీఆర్‌ఎస్ తాజాగా ప్రకటించింది. రద్దయిన సభల స్థానంలో 26న వనపర్తి, 27న మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. 26న వనపర్తితోపాటు అచ్చంపేట, మునుగోడులో, 27న మహబూబాబాద్, వర్ధన్న పేటతోపాటు పాలేరులో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
28న విరామం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భా గంగా ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 17 రోజుల్లో 41 అసెంబ్లీ నియోజ కవర్గాల్లో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్‌ను గతంలో బీఆర్‌ఎస్ ప్రకటించింది. ఈనెల 15 మొదలుకుని 18 వరకు కేసీఆర్ హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్‌లో జరిగిన సభల్లో ప్రసంగించారు. సద్దుల బతుకమ్మ, దసరా నేప థ్యంలో ఈనెల 19 నుంచి 25 వరకు కేసీఆర్ పాల్గొనే సభలకు విరామం ప్రకటించారు. 26 నుంచి తిరిగి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభమై వచ్చే నెల 9 వరకు కొనసాగుతాయి.
ఈ నెల 28న ప్రచారానికి విరా మం ఇచ్చి 29న కోదాడ, తుంగతు ర్తి, ఆలేరు 30న జుక్కల్, బాన్సువాడ, నారాయ ణ్‌ఖేడ్‌లలో, 31న హుజూర్‌నగర్, మిర్యాలగూ డ, దేవరకొండ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తిరిగి నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి 3న భైంసా (ముధోల్), ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల్, మఖ్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, 9న కామారెడ్డి సభల్లో ప్రసంగిస్తారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు.


