Rahul Gandhi: భారత్ జోడో యాత్ర బుల్లెట్ ప్రూఫ్‌ కారులో చేసేది కాదు

Bharat Jodo Yatra Not Possible In Bullet Proof Car Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఢిల్లీలో భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు భద్రతా వైఫల్యాలపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిన సీఆర్‌పీఎఫ్ రాహులే నిబంధనలు ఉల్లంఘించారని బదులిచ్చింది. 

తాజాగా రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతూ భారత్ జోడో యాత్రలో పాల్గొనలా? అని ప్రశ్నించారు. అది ఎలా సాధ్యమని వ్యాఖ్యానించారు. 

బీజేపీ నేతలు బుల్లెట్ ప్రూఫ్ కార్లను విస్మరించి నిబంధనలను తుంగలో తొక్కినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యక్తులను, పార్టీలను బట్టి ప్రోటోకాల్స్ మారుతాయా అని నిలదీశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈమేరకు మాట్లాడారు.

భారత్ జోడో యాత్ర దేశ భావోద్వేగాలకు సంబంధించిందని, తనకు చాలా విషయాలు నేర్పిందని రాహుల్ అన్నారు. తాను ఊహించిన దానికంటే ఎక్కువే నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.

అలాగే 2024లో ప్రతిపక్షాలు అన్నీ ఏకమైతే బీజేపీ గెలవడం కష్టం అన్నారు రాహుల్. ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ విజన్‌తో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.  అయితే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? అని మీడియా అడిగిన ప్రశ్నకు  ఆయన సమాధానం దాటవేశారు. తన దృష్టంతా విద్వేషం, ఆగ్రహావేశాలపై పోరాడటమేనని పేర్కొన్నారు.
చదవండి: తల్లి హీరాబెన్‌ పాడె మోసిన ప్రధాని మోదీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top