మణిపూర్‌లో ఉంది బీజేపీ సర్కార్‌ అందుకే ఇలా.. సీఎం మమత ఫైర్‌

Bengal CM Mamata Banerjee Slams BJP Over Manipur Violence - Sakshi

కోల్‌కతా: కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్‌ అయ్యారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కొనసాగుతున్న హింస నేపథ్యంలో సీఎం మమత స్పందించారు. మణిపూర్ అల్లర్లలో ఎంతమంది చనిపోయారనే లెక్కలను అక్కడి ప్రభుత్వ బహిర్గతం చేయట్లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు బెంగాల్‌లో జరిగితే కేంద్రం ఇలానే ప్రవర్తించేదా? అని ప్రశ్నించారు. 

కాగా, మమతా బెనర్జీ సోమవారం మణిపూర్‌ నిరసనలపై స్పందించారు. ఈ సందర్బంగా మమత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో చెలరేగినట్లు బెంగాల్‌లో అల్లర్లు చెలరేగితే కేంద్ర ప్రభుత్వం ఊరుకునేదా అని ప్రశ్నించారు. వందల కొద్దీ కేంద్ర బృందాలను పంపి కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసేది. మీకో న్యాయం మాకో న్యాయమా అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారు. ఎలాంటి హడావుడి చేయడం లేదని ఎద్దేవా చేశారు. 

హింసాత్మక సంఘటనల నేపథ్యంలో మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేయాలన్న ఆదేశాలు జారీ చేయడాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ కాల్పులతోపాటు సాధారణ హింసలో ఎంత మంది చనిపోయారు అన్నది చెప్పాలన్నారు. అల్లర్లలో ఎంతమంది చనిపోయారనే లెక్కలను అక్కడి ప్రభుత్వ బహిర్గతం చేయట్లేదని విమర్శించారు. దాదాపు 60 నుంచి 70 మంది వరకు చనిపోయినట్లు చెబుతున్నారని అన్నారు. ఇక, అల్లర్ల నేపథ్యంలో బెంగాల్‌కు చెందిన 18 మంది విద్యార్థులను ఇంఫాల్‌ నుంచి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చినట్టు మమత వెల్లడించారు. అలాగే, మణిపూర్‌లో నిరసనల వేళ మృతిచెందిన వారికి మమత సంతాపం తెలిపారు. 

ఇది కూడా చదవండి: కర్నాటక ఎన్నికల వేళ సోనియా సంచలన కామెంట్స్‌..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top