కేసీఆర్‌ మోకాళ్ల యాత్ర చేయాలి | Bandi Sanjay Kumar Slams Kcr Padayatra Telangana | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మోకాళ్ల యాత్ర చేయాలి

Apr 20 2022 2:54 AM | Updated on Apr 20 2022 4:41 AM

Bandi Sanjay Kumar Slams Kcr Padayatra Telangana - Sakshi

గద్వాల రూరల్‌/అయిజ రూరల్‌/మల్దకల్‌/గట్టు: ‘ప్రజల కష్టాలు తెలియాలంటే కేసీఆర్‌ మోకాళ్ల యాత్ర చేయాలి. ఆయన చేయకుంటే మేము చేపిస్తం. ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు పని చేస్తే సీఎం కేసీఆర్‌ మాత్రం రోజుకు 4 గంటలే మెలకువతో ఉంటాడు. ప్రజలు కష్టాలు పడుతుంటే ఆయన ఫాంహౌస్‌లో పడుకుంటున్నాడు’ అని బీజేపీ రాçష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం ఆరో రోజు జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం ఎల్కూర్‌లోకి అడుగుపెట్టిన ఆయనకు ప్రజలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ ‘పక్క రాష్ట్రంలో ఉండే ఎవరో కేసీఆర్‌ మా ప్రాంతంలో ఉండుంటే మాకు ఎంతో మేలు జరిగేదని అంటున్నారని టీఆర్‌ఎస్‌ వాళ్లు చెబుతున్నారు. అలా ఎవరు అన్నారో చెబితే నా భుజాలపై ఎత్తుకొని వెళ్లి కేసీఆర్‌ను ఆ ప్రాంతంలో పడేసి వస్తాను. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి కొత్తగా కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తానని అంటున్నాడు..’అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement