ఫాంహౌస్‌లలో నీలి జెండాలు పాతుతాం 

Bahujan Dandayatra Sabha organized in Siddipet - Sakshi

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): రాజకీయ నాయకుల ఫౌంహౌస్‌లలో నీలి జెండాలు పాతేస్తామని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బహుజన్‌ సమాజ్‌ పార్టీయేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన బహుజన దండయాత్ర సభలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఉన్న బహుజనులందరూ బీఎస్పీకి ఓటు వేస్తారన్నారు.

దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు, ఎస్టీబంధులతో పాటుగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ దుకాణాన్ని సైతం ప్రజలు బంద్‌ పెట్టడం ఖాయమని చెప్పారు. బహుజనులకు కావాల్సింది గొర్రెలు, చేపలు కాదని, బీఎస్సీ అధికారంలోకి వస్తే బహుజనులు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు అయ్యే అవకాశం ఉందన్నారు.  సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు గజ్వేల్‌ బహుజనులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top