తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం | Argument Between Ponnam And MLA Rakesh Reddy In Assembly | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

Mar 25 2026 5:29 PM | Updated on Mar 25 2026 6:39 PM

Argument Between Ponnam And MLA Rakesh Reddy In Assembly

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో మంత్రి పొన్నం, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పపువ్వు సారా మంచిదే గానీ.. ఇందిరమ్మ పేరు పెట్టకండంటూ రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు  శ్రీధర్‌బాబు, పొన్నం, వాకిటి శ్రీహరి మండిపడ్డారు. రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్‌  చేశారు. రాకేష్‌రెడ్డివ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. రూల్స్‌ ప్రకారమే సభ నడవాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ  ఎమ్మెల్యేల తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌,బీజేపీ ఎమ్మెల్యేలు సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. చర్చను పక్కదారి పట్టించడం సరైన పద్దతి కాదన్నారు. ఒక్క విషయాన్ని పట్టుకుని గంట సమయం వృథా చేయడం సరికాదన్నారు. రాకేష్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్న స్పీకర్‌.. కొత్త సభ్యులు పొరపాటు చేస్తే ఫ్లోర్‌ లీడర్‌ సరిచేయాలని సూచించారు.

తానేం తప్పు మాట్లాడలేదన్న రాకేష్‌రెడ్డి.. ప్రతి స్కీమ్‌కు ఇందిరమ్మ పేరు పెడుతున్నారు.. ఈ స్కీమ్‌కు ఆమె పేరు పెట్టొద్దని చెప్పానంటూ రాకేష్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలంటే హౌస్‌ కమిటీ వేయండి.. ఇందిరమ్మపై తప్పుగా ప్రచారం చేస్తుంటే తానూ మాత్రమే ఖండించానని రాకేష్‌రెడ్డి అన్నారు. ఇప్పపువ్వు సారా ఫ్యాక్టరీకి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని చెప్పడం తప్పేమీ కాదంటూ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని.. ఇందిరమ్మ పేరు ఎందుకు తెచ్చారో రాకేష్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందేని మంత్రి సీతక్క అన్నారు.

BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

 

 

Advertisement
 
Advertisement
Advertisement