పురందేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌ | Sakshi
Sakshi News home page

పురందేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

Published Sun, Nov 5 2023 2:54 PM

ap minister peddireddy slams state bjp chief purandeswari - Sakshi

సాక్షి, విజయవాడ:  పురంధేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తరపున ఆమె మాట్లాడితే ఇబ్బంది లేదని, అయితే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనన్నారు. మద్యంపై  చంద్రబాబుతో పురంధేశ్వరి మాట్లాడితేనే మంచిదన్నారు. 

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్లను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గక ఇంఛార్జ్‌ దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మేయర్‌ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement