పదవి కోసమే ఆదినారాయణరెడ్డి ఆరోపణలు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

AP Chief Whip Fires On Chandrababunaidu In YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమే.. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టినవారిపై ఆరోపణలు చేయడం తగదు. స్వప్రయోజనాల కోసం సంస్కారం మరిచిపోవద్దు అని ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ విప్‌  గడికోట శ్రీకాంత్‌రెడ్డి  అన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత. కేంద్రంలో అధికారం ఉన్నామన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితం అయ్యింది. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి బీజేపీది’’ అని విమర్శించారు.

‘‘బీజేపీ నేతలు మంది మార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు. నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. విభజన చట్టంలో హామీలు నేరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. ప్రత్యేక హోదా, దుర్గరాజపట్నం, స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేస్తాం. వ్యక్తిగతంగా దూషణలు, ఆరోపణలు చేయడం సంస్కారం కాదు. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారు’’ అని తెలిపారు.

‘‘సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తాం. ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది. సోమశిల విషయంలో పెండింగ్‌లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి ఒన్ టైం సెటిల్ మెంట్ చేశాం అని శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.

‘‘మా ప్రభుత్వంపై చంద్రబాబు కావాలని బురద జల్లుతున్నారు. చంద్రబాబు లాగా.. మేము అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ప్రజాబలం ఉన్నప్పుడు మాకు ఇంకో బలం అవసరంలేదు. టీడీపీ ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడ్డం అనవసరం. మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత వంగి వంగి దండాలు పెట్టారు..  ఏదోరకంగా ప్రచారం కావాలని టీడీపీ కోరుకుంటున్నారు.. చంద్రబాబు గురించి అందరికి తెలుసు’’ అన్నారు.

చదవండి: ఏపీలో చం‍ద్రబాబు కొత్తగా బూతు రాజకీయాలు తెచ్చారు: ఎంపీ భరత్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top