
సాక్షి,తాడేపల్లి: సాక్షి ఎడిటర్ మీద ఏడు కేసులు పెట్టారు. కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించలేకపోతున్నారు. పరిపాలనలో కూటమి ప్రభుత్వం విఫలం కావడంతో డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారు.
లిక్కర్ కేసు పుష్పక విమానం లాంటిది, కేసులు పెడుతూనే ఉంటారు.లిక్కర్ అక్రమ కేసుల్లో సిట్ భేతాళ కథలు అల్లుతూనే ఉంది. నేరారోపణలు చేస్తున్నారు కానీ.. ఆధారాలు చూపడంలో సిట్ విఫలం. సరైన ఆధారాలు సేకరించడంలో సిట్ పూర్తిగా విఫలమైంది. సిట్ ఇన్వెస్ట్‌గేషన్‌లో ఆంధ్రజ్యోతి,ఈనాడు ప్రధాన పాత్ర. చంద్రబాబు అల్లిన లిక్కర్ కథకు సిట్ అద్భుతమైన కథనాలు అల్లుతోంది.
లిక్కర్ అక్రమ కేసు రూ.50వేల కోట్ల నుంచి రూ.11 కోట్లకు వచ్చింది..!!.భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరు చంద్రబాబు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
