
ఈ ఎన్నికలలో ప్రతిపక్షాల కన్నా ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఎక్కువగా గెలవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కోస్తా, రాయలసీమలలో అంటే ప్రస్తుత విభజిత ఆంద్రప్రదేశ్‌లో 101 సీట్లు గెలుచుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా స్వతంత్ర పార్టీ ఇరవైతొమ్మిది సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల నాటికి కమ్యూనిస్టు పార్టీ రెండుగా సీపీఐ, సీపీఎం లుగా చీలి బాగా బలహీనపడ్డాయి. ఆంద్రప్రదేశ్‌లో ఈ రెండు పార్టీలకు కలిపి పదకొండు సీట్లే దక్కాయి. కాగా ఇండిపెండెంట్లు నలభైఐదు మంది నెగ్గారు. మొత్తం 186 సీట్లకు గాను సామాజికవర్గాల పరంగా చూస్తే రెడ్డి, కమ్మ వర్గాలవారు సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. రెడ్లు ముప్పైఏడు మంది, కమ్మ ముప్పైఏడు మంది గెలిచారు. రెడ్లు రాయలసీమలో తమ ఆదిపత్యాన్ని నిలబెట్టుకుంటే, కమ్మ వర్గం కోస్తాలో పట్టు కొనసాగించింది. కాంగ్రెస్ పక్షాన రెడ్లు కోస్తాలో ఎనిమిది మంది గెలవగా, రాయలసీమలో పదహారు మంది నెగ్గారు.
స్వతంత్ర పార్టీ నుంచి ఇద్దరు గెలిస్తే ఒకరు కోస్తా, మరొకరు రాయలసీమ వారు. సీపీఎం నుంచి గెలిచిన ఇద్దరు రెడ్లు రాయలసీమవారే. ఇండిపెండెంట్లలో నలుగురు కోస్తావారు. ఐదుగురు రాయల సీమవారు. మొత్తం మీద ఇరవై నాలుగు మంది రెడ్లు రాయలసీమ నుంచి నెగ్గారు. ఇక కమ్మ వర్గం ఎమ్మెల్యేలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇరవైముడు, స్వతంత్ర పార్టీ నుంచి ఆరుగురు, కమ్యూనిస్టు పార్టీ నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్లు ఐదుగురు నెగ్గారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో నలుగురుతప్ప మిగిలిన 19 మంది కోస్తావారే. కమ్యూనిస్టు పార్టీ నుంచి విజయం సాదించినవారిలో ఇద్దరు కోస్తా, ఒకరు రాయలసీమవారు. స్వతంత్రపార్టీ వారు ఆరుగురు కోస్తాకు చెందినవారు. ఇండిపెండెంట్లలో ఐదుగురు కోస్తా జిల్లాలవారే. మొత్తం మీద చూస్తే ముప్పైరెండు మంది కోస్తాకు చెందినవారైతే, ఐదుగురు మాత్రం రాయలసీమవారన్నమాట. కాపు, తెలగ, బలిజ సామాజికవర్గాల నుంచి పందొమ్మిది మంది ఎన్నిక కాగా, ఏడుగురు కాంగ్రెస్, తొమ్మిది మంది ఇండిపెండెంట్లు గెలిచారు.
స్వతంత్ర పార్టీ, సీపీఐ, సీపీఎం ల నుంచొ ఒక్కొక్కరు గెలిచారు. వీరిలో ఒకరు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాలవారే.అయితే అప్పట్లో ఎర్రగొండపాలెం కర్నూలు జిల్లాలో ఉండేది. తదుపరి ప్రకాశం జిల్లాలోకి మారింది. ఇక బిసి వర్గాల నుంచి ముప్పైరెండు మంది ఎన్నిక కాగా వారిలో పదకొండు మంది కాంగ్రెస్, పదకొండు మంది స్వతంత్ర పార్టీలకు చెందినవారు. సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు, ఇండిపెండెంట్లు తొమ్మిది మంది గెలిచారు. వీరిలో ఏడుగురు రాయలసీమ, మిగిలినవారు కోస్తా జిల్లాల వారు.ఇందులో కూడా ఉత్తరాంద్ర నుంచి పద్దెనిమిది వంది ఎన్నికయ్యారు.
ఎస్సి నియోజకవర్గాలో కాంగ్రెస్ నుంచి పదమూడు మంది గెలవగా, వారిలో ఒకరు అద్దంకి జనరల్ నుంచి ఎస్.సి నేత గెలవడం విశేషం.ఏడుగురు స్వతంత్ర పార్టీ నుంచి సీపీఐ, రిపబ్లికన్ పార్టీల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. మిగిలనవారు ఇండిపెండెంట్లు. బ్రాహ్మణులు ఎనిమిది గెలవగా, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఒకరు భారతీయ జనసంఘం నుంచి గెలిచారు. ఒకరు సీపీఐ, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు. క్షత్రియులు పదకొండు మంది గెలవగా, వారిలో ఏడుగురు కాంగ్రెస్ వారు. ఒకరు సీపీఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు.వైశ్యులు ఆరుగురు గెలవగా, వారిలో నలుగురు కాంగ్రెస్, ఒకరు స్వతంత్ర,ఒకరు భారతీయ జనసంఘం నుంచి గెలిచారు.ముస్లింలు ఇద్దరూ కాంగ్రెస్ వారే.వెలమలో ఒకరు కాంగ్రెస్ కాగా, మరొకరు ఇండిపెండెంట్.
రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు –కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు..24
గణపా రామస్వామిరెడ్డి-పెదకూరపాడు, కాసు బ్రహ్మానందరెడ్డి-నరసరావుపేట, వి.లింగారెడ్డి-మాచర్ల, గాదె వెంకటరెడ్డి-పర్చూరు, సి.రామచంద్రారెడ్డి-ఒంగోలు, పులి వెంకటరెడ్డి-కనిగిరి, వి.వెంకురెడ్డి-కోవూరు, ఎసి సుబ్బారెడ్డి-రాపూరు, బి.వీరారెడ్డి-బద్వేలు, ఎమ్.కృష్ణారెడ్డి- రాయచోటి, ఆర్.రాజగోపాలరెడ్డి- లక్కిరెడ్డిపల్లె, పి.బసిరెడ్డి-పులివెందుల, ఆర్.రామసుబ్బారెడ్డి- ప్రొద్దుటూరు, ఎస్.పి నాగిరెడ్డి-మైదుకూరు, సి.రాంభూపాల్ రెడ్డి-నందికోట్కూరు, బి.వి.సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల, కె.రామచంద్రారెడ్డి-నల్లమడ, నారాయణరెడ్డి-పెనుకొండ, పద్మా భాస్కరరెడ్డి-గోరంట్ల, కెవి వేమారెడ్డి-కదిరి,టి.ఎన్.అనసూయమ్మ-తంబళ్లపల్లె, జివి.శ్రీనాదరెడ్డి-పీలేరు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి-వాయల్పాడు, వి.రామస్వామిరెడ్డి-పుంగనూరు.
- స్వతంత్ర పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు..2
- పి.రామచంద్రారెడ్డి-ఆత్మకూరు, ఎ.ఈశ్వరరెడ్డి-తిరుపతి
- సీపీఎం రెడ్డి ఎమ్మెల్యేలు..2
- పి.ఈశ్వరరెడ్డి-ప్రత్తికొండ,తరిమెల నాగిరెడ్డి-అనంతపురం
- ఇండిపెండెంట్ రెడ్డి ఎమ్మెల్యేలు..9
- ఎ.రామిరెడ్డి-దుగ్గిరాల, డి.పాండురంగారెడ్డి-గిద్దలూరు, బెజవాడ పాపిరెడ్డి-అల్లూరు, వి.రామచంద్రారెడ్డి-గూడూరు, ఎన్.పుల్లారెడ్డి-కమలాపురం, గంగుల తిమ్మారెడ్డి-ఆళ్లగడ్డ, వెంకటరెడ్డి-పాణ్యం, కె. అంజనారెడ్డి-హిందుపూర్, ,బి.గంగసుబ్బరామిరెడ్డి-శ్రీకాళహస్తి.
కమ్మ సమాజికవర్గ ఎమ్మెల్యేలు-37 –కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు..23
వి.రామన్నచౌదరి-అనపర్తి, కె.వీరన్న-బూరుగుపూడి,అల్లూరు కృష్ణారావు-తాడేపల్లిగూడెం, ఎమ్.రామ్మోహన్ రావు-ఉంగుటూరు, గద్దె విష్ణుమూర్తి-చింతలపూడి, వెలివెల సీతారామయ్య-గన్నవరం, ఎమ్.కస్తూరి దేవి-గుడివాడ, వై.శివరామప్రసాద్-అవనిగడ్డ, అక్కినేని భాస్కరరావు-కంకిపాడు, చనుమోలు వెంకటరావు-మైలవరం, ఎ.సూర్యనారాయణ-నందిగామ, జివి రత్తయ్య-తాడికొండ, పి. అంకినీడు ప్రసాదరావు-పొన్నూరు, డి.ఇందిర-తెనాలి, చేబ్రోలు హనుమయ్య-గుంటూరు-2, భవనం జయప్రద-వినుకొండ, చెంచురామా నాయుడు-కందుకూరు, సి.రోశయ్యనాయుడు-కొండపి, కాటూరి నారాయణస్వామి-పొదిలి, గుర్రం చిన వెంకన్న-ఉరవకొండ, చల్లా సుబ్బారాయుడు-తాడిపత్రి, కిలారు గోపాలనాయుడు-నగరి, డి.ఆంజనేయులు నాయుడు-చిత్తూరు
స్వతంత్ర పార్టీ కమ్మ ఎమ్మెల్యేలు..6
- యడ్లపాటి వెంకటరావు-వేమూరు
- ఎమ్.సి.నాగయ్య-ప్రత్తిపాడు
- కందిమళ్ల బుచ్చయ్య-చిలకలూరిపేట
- రావిపాటి మహానంద- ఎర్రగొండపాలెం
- జి.సుబ్బనాయుడు-కావలి
- ధనేకుల నరసింహం-ఉదయగిరి
సీపీఐ కమ్మ ఎమ్మెల్యేలు..3
- యు.నారాయణమూర్తి-పెద్దాపురం
- సిప్రభాకర చౌదరి-రాజమండ్రి
- జి.శివయ్య-పుత్తూరు
ఇండిపెండెంట్ కమ్మ ఎమ్మెల్యేలు..5
- కె.బుచ్చినాయుడు-కొవ్వూరు
- జి.సత్యనారాయణమూర్తి-తణుకు
- కాజ రామనాధం-ముదినేపల్లి
- కె.వెంకటేశ్వరరావు-ఉయ్యూరు
- చప్పిడి వెంగయ్య-మార్కాపురం
కాపు, తెలగ, బలిజ ఎమ్మెల్యేలు-19; కాంగ్రెస్ కాపు ఎమ్మెల్యేలు...7
- కె.అప్పడుదొర-భోగాపురం-తెలగ దొర
- వైఎస్ ఎన్ మూర్తి-పిఠాపురం
- నయనాల గణేశ్వరరావు-రాజోలు
- జవ్వాది లక్ష్మయ్య-పెనుకొండ
- మాలె వెంకట నారాయణ-ఏలూరు
- ఎడం చెన్నయ్య-రేపల్లె
- శనక్కాయల అరుణ
గుంటూరు-1; సీపీఐ, సీపీఎం కాపు ఎమ్మెల్యేలు..2
- పోలిశెట్టి శేషావతారం-పాలకొల్లు-సీపీఎమ్
- పూల సుబ్బయ్య-ఎర్రగొండపాలెం (బలిజ)-సీపీఐ
స్వతంత్ర-1
- నిచ్చర్ల రాములు-టెక్కలి-తెలగ
ఇండిపెండెంట్ కాపు ఎమ్మెల్యేలు..9
- ఎన్.సత్యనారాయణ-యలమంచిలి
- ముద్రగడ వీరరాఘవరావు-ప్రత్తిపాడు
- నున్న వీర్రాజు-రామచంద్రపురం
- సంగీత వెంకటరెడ్డి-ఆలమూరు
- పంతం కామరాజు-జగ్గంపేట
- కె.కుసుమేశ్వరరావు-ఉండి
- సి.పాండురంగారావు-కైకలూరు
- బి.నిరం జనరావు-మల్లేశ్వరం
- బి.రత్నసభాపతి-రాజంపేట(బలిజ)
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు