వచ్చే ఎన్నికల్లో వైరా (ఎస్టి) నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు..! | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో వైరా (ఎస్టి) నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు..!

Published Fri, Aug 11 2023 1:44 PM

-- - Sakshi

వైరా (ఎస్టి) నియోజకవర్గం

2009లో నియోజకవర్గ పునర్ విభజనలో సుజాతనగర్‌ నియోజకవర్గం రద్దై వైరా నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

వైరా గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీచేసిన లావుడ్యా రాములు విజయం సాదించారు. ఆయన  సిటింగ్‌ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్‌ అభ్యర్ది మదన్‌ లాల్‌పై 2013 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. 2014 లో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ తరపున గెలిచిన మదన్‌ లాల్‌ ఆ తర్వాత టిఆర్‌ఎస్‌ లో చేరి 2018లో ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసినా ఫలితం దక్కలేదు.రాములు నాయక్‌కు 52650 ఓట్లు రాగా, మదన్‌ లాల్‌ కు 50637 ఓట్లు వచ్చాయి. సిపిఐ పక్షాన పోటీచేసిన బానోతు విజయకు 32757 ఓట్లు వచ్చాయి.

2018లో కేవలం రెండు సీట్లలో మాత్రమే ఇండిపెండెంట్లు,లేదా గుర్తింపు లేని పార్టీలవారు గెలిచారు. వాటిలో ఒకటి వైరా కాగా, మరొకటి రామగుండం. రెండుచోట్ల గెలిచిన వారు తదుపరి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2014లో ఖమ్మం జిల్లాలో మాత్రమే వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ తన ఉనికిని నిలబెట్టుకుంది. తెలంగాణలో మూడు నియోజకవర్గాలలో ఆ పార్టీ గెలిస్తే అందులో ఒకటి వైరా నియోజకవర్గం కావడం విశేషం.

వైరాలో వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ అభ్యర్ధి మదన్‌ లాల్‌ తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బాలాజీ నాయక్‌ను 10583 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. ఎన్నికల తర్వాత కొంతకాలానికి మదన్‌ లాల్‌ అదికార టిఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. 2009లో  వైరాలో సిపిఐ తరపున గెలిచిన చంద్రావతి బిజెపి లోకి వెళ్లి అక్కడ నుంచి టిఆర్‌ఎస్‌లోకి మారి పోటీచేసినా ఫలితం దక్కలేదు.

సుజాతనగర్‌ (2009లో రద్దు)

1978లో ఏర్పడిన ఈ శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా ఎనిమిదిసార్లు ఎన్నికలు జరగ్గా, నాలుగుసార్లు సిపిఐ, నాలుగుసార్లు కాంగ్రెస్‌ (ఐ)లు గెలుపొందాయి. సిపిఐ నాయకుడు మహమ్మద్‌ రజబ్‌అలీ ఇక్కడ నాలుగుసార్లు గెలవగా, అంతకుముందు ఖమ్మంలో రెండుసార్లు గెలుపొందారు. జిల్లాలోనే ఆరుసార్లు గెలిచిన నేతగా ఈయన నమోదయ్యారు.  ఖమ్మంలో ఒకసారి సిపిఎం పక్షాన, మరోసారి సిపిఐ తరపున గెలిచారు. 1994 ఎన్నికల తర్వాత కొంతకాలానికి రజబ్‌ అలీ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఐ అభ్యర్ది రాంరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు.

1999లో, 2004లో మళ్లీ వెంకటరెడ్డి గెలుపొందారు. తదుపరి ఈ నియోజకవర్గం రద్దు కావడంతో పాలేరుకు మారి మరో రెండుసార్లు గెలిచారు. 2014 లో గెలిచిన కొంతకాలానికి ఆయన కన్నుమూశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. రామిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు దామోదర్‌రెడ్డి నల్గొండ జిల్లా తుంగుతుర్తిలో నాలుగుసార్లు గెలుపొందారు. సూర్యాపేటలో మరోసారి గెలుపొందారు. దామోదరరెడ్డి కూడా గతంలో మంత్రి పదవి నిర్వహించారు. సుజాతనగర్‌లో మూడుసార్లు రెడ్డి, ఒకసారి కమ్మ, మూడుసార్లు ముస్లింలు  ఎన్నికయ్యారు.

వైరా (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement
 
Advertisement
 
Advertisement