Success Story
సింగరేణి నాకు జన్మభూమి
● డీజీఎంఎస్‌గా ప్రేమ్‌కుమార్
● ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీలో విజయం
జ్యోతినగర్: సాధారణ కార్మిక కుటుంబం నుంచి ఎదగి.. బొగ్గు గనుల భద్రతా రంగంలో గుర్తింపు పొందిన యువ అధికారి కనకం ప్రేమ్‌కుమార్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్)లో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్‌సేఫ్టీ (డీడీఎంఎంస్)గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. తాజాగా అసోం ప్రాంతానికి బదిలీ అయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ప్రేమ్‌కుమార్ తండ్రి కనకం మోహన్ సింగరేణిలో డంపర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. తల్లి ఎమీలియా గృహిణి. ఆయనకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు.
ఉద్యోగ ప్రయాణం..
ప్రేమ్‌కుమార్ నాగ్‌పూర్‌లోని వీఎన్‌ఐటీలో మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2011–12 బ్యాచ్‌లో ఉత్తీర్ణులయ్యారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా కోల్‌ఇండియా కంపెనీలో ఉద్యోగం సాధించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైన్స్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేశారు.
గోదావరిఖనిలో విద్యాభ్యాసం
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో విద్యాభ్యాసం పూర్తిచేశారు ప్రేమ్‌కుమార్. కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఆయన స్వస్థలం. సింగరేణి గనికార్మికుడిగా తన తండ్రి మార్గదర్శకత్వంలో కష్టపడేతత్వం అవర్చుకున్నారు.
యూపీఎస్సీలో విజయం
యూపీఎస్సీలో విజయం సాధించడం లక్ష్యంగా ప్రిపేరైన ప్రేమ్‌కుమార్.. 2021లో విజయం సాధించారు. అనంతరం 2022లో డీజీఎంఎస్ దక్షిణ ప్రాంతంలో డీడీఎంఎస్‌గా నియమితులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో పలు బొగ్గు గనుల భద్రత అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
ఈదురుగాలులు.. కొట్టం కూలి వృద్ధుడి మృతి
సింగరేణి సంస్థ నాకు జన్మభూమి. మా కుటుంబంలో నాన్న సింగరేణిలో విధులు నిర్వహిస్తుండటంతోనే నాకు ఉన్నత విద్య చదువుకునే అవకాశం లభించింది. కష్టపడితే సాధారణ కుటుంబం నుంచైనా మంచి స్థాయికి ఎదగవచ్చు.
– ప్రేమ్‌కుమార్, ఎన్టీపీసీ, రామగుండం


