రంగుల మాలలు | - | Sakshi
Sakshi News home page

రంగుల మాలలు

May 21 2026 12:44 AM | Updated on May 21 2026 12:44 AM

తామర పూలను తెస్తాం

తనివితీరా మాల కడతాం తల్లిదండ్రుల మెడలో వేస్తాం !

గులాబీ పూలను తెస్తాం

గుత్తులు గుత్తుల మాల కడతాం

గురువు గారి మెడలో వేస్తాం !

చామంతి పూలను తెస్తాం చకచకా మాల కడతాం చదువులమ్మ మెడలో వేస్తాం !

మందార పూలను తెస్తాం

మెలికలేసి మాల కడతాం

మహనీయుల మెడలో వేస్తాం !

బంతిపూలను తెస్తాం

బొద్దుబొద్దుగా మాల కడతాం భరతమాత మెడలో వేస్తాం !

నందివర్ధన పూలను తెస్తాం నిగనిగలాడే మాల కడతాం నింగి నేలకు చుట్టేస్తాం !!!

బోనగిరి పాండురంగ

తొర్రూరు టౌన్‌,

జిల్లా: మహబూబాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement