ఆ రోజు సెలవు ముందు రోజు అమ్మ నాన్న తాతయ్య నానమ్మ అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్దామని అనుకున్నాం. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో చోటికి వెళ్దామని చెప్పారు. అప్పుడు నేను, మా చెల్లి, మా తమ్ముళ్లు జూ పార్క్‌కు వెళ్దామన్నాం. అప్పుడు మా నాన్న జూపార్క్ కన్నా సినిమాకు పోదాం అన్నారు. మా తాతయ్య బాగోతానికి వెళ్దామాన్నారు. మా నాయనమ్మ అందరం కలిసి దేవాలయానికి వెళ్దామన్నారు. అప్పుడు మా నాన్న.. సరే మీరు అన్నట్లు సెలవు రోజు అంటే రేపు అందరం జూపార్క్, సినిమాకు వెళ్దాం. వచ్చే వారం బాగోతానికి వెళ్దామన్నారు.
మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి జూపార్కు, సినిమాకు రెడీ అయ్యాం. ఇంకా వారం రోజులైతే నాకు, మా చెల్లికి పదో తరగతి పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. మన ఊరి గ్రామస్తుడు ముద్దసాని మోహన్‌రెడ్డి మొదటి మరియు రెండో వ్యక్తికి రూ.20వేలు ప్రోత్సాహకంగా ఇస్తాడు అని నాన్న అన్నారు. ఈసారి పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులైతే అందరం కలిసి కొత్త స్థలానికి వెళ్దామన్నారు.
జూ పార్కు మరియు సినిమాకు వెళ్లి వచ్చాము వచ్చిన తర్వాత ఇక వారం రోజులు పరీక్షలకు విలువి ఉన్నాయని చదివాము మొదటిరోజు తెలుగు రెండవ రోజు హిందీ మూడవరోజు ఆంగ్లం నాలుగో రోజు గణితం ఐదవ రోజు భౌతిక శాస్త్రం ఆరవ రోజు జీవశాస్త్రం ఏడవ రోజు సోషల్ పరీక్షలు జరుగుతాయి మేము నేను మా చెల్లి ఇద్దరం ఈసారి ఉత్తీర్ణులమవుదామని అనుకున్నాం.
ఉత్తీర్ణులమైతే ఈసారి మా అమ్మ, నాన్న పేరు, మా ఊరి పేరు దక్కించిన వాళ్లమవుతామని ఆశతో చాలా కష్టపడి చదివాను. మాది చాలా నిరుపేద కుటుంబం. మా నాన్న, అమ్మ కష్టపడితే కానీ మేము తినలేము. ఈ ఉన్న వారం రోజుల్లో మేము బాగా చదివినాము. పరీక్షలు రాసినాము. తర్వాత చాలా భయపడ్డాం. పదో తరగతిలో పాస్ అవుతామో.. లేదోనని ఆందోళన ఉంది. అటు తల్లిదండ్రుల కష్టం.. ఇటు ఉపాధ్యాయులు నాపట్ల ఇచ్చే చదువు ఈ రెండింటిని ఆలోచించుకుంటే నాకు చాలా ఆందోళన వేసింది. కొన్ని రోజులకు రిజల్ట్ ప్రకటించారు. నేను, మా చెల్లి ఇద్దరం అత్యున్నత మార్కులతో నిలిచాం. నేను మొదటి స్థానం, మా చెల్లి రెండో స్థానంలో నిలిచింది. మా గ్రామస్తుడు, దాత మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రోత్సాహక డబ్బులు, ప్రశంసలు పొందాం. మా గ్రామస్తులు అభినందించారు. మా అమ్మ, నాన్న, ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే జిల్లా మొత్తంలో మా ఊరి బడే ప్రథమ స్థానంలో నిలిచింది. అందరం కలిసి గోల్కొండ కోటకి వెళ్లాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఎవరు చూసినా కరీంనగర్‌లో పదో తరగతిలో ఉత్తీర్ణత మార్కులు వచ్చిన వారు మీరే కదా అన్నారు. అప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాను.
వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా...
– ఎన్.శ్రీకర్,
గ్రామం: ఊటూరు
మండలం: మానకొండూర్


