పాతఫోన్లకు ప్లాస్టిక్‌ వస్తువులు | - | Sakshi
Sakshi News home page

పాతఫోన్లకు ప్లాస్టిక్‌ వస్తువులు

May 21 2026 12:44 AM | Updated on May 21 2026 12:44 AM

పెద్దపల్లిరూరల్‌: పాత మొబైల్‌ ఇస్తే ప్లాస్టిక్‌ వస్తువులిస్తమని మోపెడ్‌పై పల్లెల్లో తిరుగుతున్న వారిని పెద్దపల్లిరూరల్‌ ఏఎస్సై తిరుపతి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి గ్రామంలో ప్లాస్టిక్‌ సామాన్లను మోపెడుపై పెట్టుకుని గల్లీగల్లీ, ఇల్లిల్లూ తిరుగుతూ పాతసెల్‌ఫోన్లు ఇస్తే వాటికి బదులు ప్లాస్టిక్‌ వస్తువులు ఇస్తామని పలువురి నుంచి సేకరిస్తుండడాన్ని గమనించిన సర్పంచ్‌ వేల్పుల రమేశ్‌.. పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై అక్కడకు చేరుకుని విచారిస్తే ఒక్కసెల్‌ఫోన్‌ మాత్రమే ఉందని సదరు వ్యక్తులు బుకాయించారు. అనుమానంతో వారివద్ద ఉన్న సామగ్రిని కింద పోయగా అందులో నుంచి పలు రకాల ఫోన్లు బయటపడ్డాయి. వాటన్నింటినీ స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పాతఫోన్‌ కదా అని ఎవరికీ ఇవ్వొద్దు

పాత సెల్‌ఫోనే కదా అని ప్లాస్టిక్‌ వస్తువులకు ఆశపడి ఇవ్వొద్దని పెద్దపల్లిరూరల్‌ లైస్సె మల్లేశ్‌ సూచించారు. పాత సెల్‌ఫోన్‌ల సేకరణ పేరిట పెద్దమోసాలు జరుగుతున్నాయని తెలిపారు. మనం వాడినప్పుడు నమోదైన వ్యక్తిగతసమాచారం, బ్యాంకింగ్‌ వివరాలు, ఫొటోలు లాంటి ముఖ్యమైన డేటా అందులో ఉండే అవకాశముందన్నారు. ఇలా సేకరించిన వారు ఆ సెల్‌ఫోన్లను దుర్వినియోగం చేసే ప్రమాదముందని అన్నారు. పోలీసులకు సమాచారం అందించిన సర్పంచ్‌ వేల్పుల రమేశ్‌ను అభినందించారు.

నిమ్మనపల్లిలో కొందరి వ్యాపారం

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement