గిరిజన యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గిరిజన యువతి ఆత్మహత్య

May 21 2026 12:44 AM | Updated on May 21 2026 12:44 AM

ధర్మపురి: జీవితంపై విరక్తితో గిరిజన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బోదరనక్కలచెరువు గూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్‌ కథనం ప్రకారం.. గూడెంకు చెందిన మారినేని లచ్చయ్యకు ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు రమ్య(21) ఇంటర్‌ మధ్యలో ఆపేసి ఇంటివద్దనే ఉంటోంది. మనస్తాపంతో బుధవారం ఎవరూ లేని సమయంలో ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుంది. లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మాయమాటలు చెప్పి..

పింఛన్‌ కాజేసి..

జమ్మికుంట: మాయమాటలు చెప్పి వృద్ధురాలి పింఛన్‌ డబ్బులను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన రామంచ అయిలమ్మ అనే వృద్ధురాలు బుధవారం జమ్మికుంట పట్టణంలోని ఓ బ్యాంక్‌కు పింఛన్‌ డబ్బులు విడిపించుకునేందుకు వచ్చింది. 2 నెలల పింఛన్‌ రూ.4వేలు విడిపించుకొని బయటకు రాగా.. అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని దుండగుడు పింఛన్‌ రూ.6వేలు రావాల్సింది, బ్యాంక్‌వాళ్లు తక్కువ ఇచ్చారంటూ మాయమాటలతో బురడి కొట్టించాడు. 2 నెలల పింఛన్‌ డబ్బులు తీసుకొని బ్యాంక్‌ వద్దకు తీసుకొచ్చి పాస్‌బుక్‌ జిరాక్స్‌ తీసుకురమ్మని చెప్పి రూ.4వేలతో ఉడాయించాడు. మోసపోయానని తెలుసుకున్న అయిలమ్మ బోరున విలపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement