పెద్దపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్)ను పారదర్శకంగా, సమర్థవంతంగా ని ర్వహించి అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో ప నిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. వి విధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం ఎస్‌ఐఆర్ అమలు తీరుపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ, మృతులు, వలస వెళ్లిన వారితోపాటు డూప్లికేట్ ఓటర్ల తొలగింపు కో సమే ఎస్‌ఐఆర్ చేపట్టామన్నారు. ప్రతీ రాజకీయ పార్టీ బీఎల్‌ఏలను నియమించి ఎస్‌ఐఆర్‌ను పర్యవేక్షించాలని సూచించారు. జూన్ 15 నుంచి 24వ తేదీ వరకు ఎస్‌ఐఆర్‌లో పాల్గొనే బీఎల్‌వోలు, సిబ్బంది కి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారని తెలిపారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ పాల్గొన్నారు. జిల్లా ఉ పాధి కల్పనాధికారి కార్యాలయంలో జరిగిన మరో కార్యక్రమంలో శ్రీహర్ష మా ట్లాడుతూ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకోవాలన్నారు. జి ల్లా యువజన క్రీడా శాఖ కార్యాలయంలో టూరి జం గైడ్‌పోస్టర్ ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ అధి కారి రంగారెడ్డి, ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు రాజగోపాల్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రకటన చేస్తూ.. జిల్లాలో మ క్కల కొనుగోళ్లు వేగంగా సాగున్నాయన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


