ధాన్యం కొనుగోళ్లలో కోతలా? | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో కోతలా?

May 21 2026 12:44 AM | Updated on May 21 2026 12:44 AM

పెద్దపల్లిరూరల్‌: ‘నేను రైతు పక్షపాతిని.. వాళ్లకు క ష్టం, నష్టం కలుగనివ్వను. నాపై అవినీతి ఆరోపణ లు చేసేందుకు ఏమీ కనిపిస్తలేదు.. అందుకే ధా న్యం కొనుగోళ్లలో కోతలు అని నిందారోపణలు చే స్తున్నారు’ అని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపై మండిపడ్డా రు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బు ధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విప్‌ మాట్లాడారు. ధాన్యంలో కోతల గురించి సమాచారం ఉంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. నీ సొంత ఊ రు కాసులపల్లిలో నిరూపించినా వస్తానని అన్నారు. ధాన్యం డబ్బును 48గంటల్లోగా బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మక్కలు కొనుగోలు చేశారా?

‘మీరు అధికారంలో ఉన్న పదేళ్లలో మక్కలు ఏనాడైనా కొనుగోలు చేశారా?’ అని విజయరమణారావు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం క్వింటాల్‌ మక్కలను మద్దతు ధర రూ.2,400తో కొనుగోలు చేస్తోందన్నారు. మట్టి, ఇ సుక అక్రమంగా తరలించి అమ్ముకున్న చరిత్రమీ దేనని ఫైర్‌ అయ్యారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్లు కూ ర మల్లారెడ్డి, ప్రకాశ్‌రావు, మున్సిపల్‌ చైర్మన్లు మల్ల య్య, రాధాకృష్ణ, నాయకులు మహేందర్‌, సారయ్యగౌడ్‌, మస్రత్‌, కొమ్ము సుధాకర్‌, పెగడ రమేశ్‌, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు భోజన్నపేటలో ఎల్లమ్మ బోనాల వేడుకలకు విప్‌ విజయరమణారావు హాజరయ్యారు.

మాజీ ఎమ్మెల్యేపై ప్రభుత్వ విప్‌ విజయరమణారావు ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement