కూలర్లు ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

కూలర్లు ఏర్పాటు చేయండి

May 21 2026 12:44 AM | Updated on May 21 2026 12:44 AM

క్రిటికల్‌ కేర్‌లో గర్భిణులకు పరీక్షలు నిర్వహించే ప్రాంతాల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలి. గర్భిణి అయిన నా భార్యను ఇటీవల పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకుపోయిన. చాలాఇబ్బందులు ఎదుర్కొన్నాం. పాపం గర్భిణుల పరిస్థితి చూసైనా అధికారులకు స్పందన రావడం లేదు. ఉక్కపోతతో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారులు స్పందించి కనీసం ఉక్కపోతకు ఉపశమనం కల్పించడానికి సరిపడా కూలర్లు ఏర్పాటు చేయాలి.

– సంతోష్‌, సుందిళ్ల

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం

కూలర్లు ఏర్పాటు చేయడం బడ్జెట్‌తో కూడుకున్నది. ఈ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటికే 10 కూలర్లు కొనుగోలు చేశాం. ఇందులో రెండు కొత్త బ్లాక్‌లో, ఎనిమిది పాత బ్లాక్‌లోని సెకండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశాం. కొనుగోలు చేసిన కూలర్లను స్టోరేజ్‌ చేయడం కూడా కష్టమైనందున దీనిపై కూడా సమీక్ష చేస్తున్నాం.

– కృపాభాయి, ఆర్‌ఎంవో, జీజీహెచ్‌

Advertisement
 
Advertisement
Advertisement