ఇంట్లో ఫ్రిడ్జి ఉందా? | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఫ్రిడ్జి ఉందా?

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

తూతూమంత్రంగా..

సాక్షి పెద్దపల్లి: మీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జి, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ఉన్నాయా? ఎన్నిగదులు వినిగిస్తున్నా రు? పెళ్లయిన జంటలు ఉన్నాయా? ఇంటి పైకప్పు, ఫ్లోర్‌కు వాడిన మెటీరియల్‌ ఏమిటి? ఎలాంటి మ రుగుదొడ్డి ఉంది? బాత్‌రూంకు పైకప్పు ఉందా? డ్రైనేజీ ఉందా? బైక్‌లు ఎన్ని? కార్లు ఎన్ని? ప్రధానంగా తీసుకునే ఆహారం ఏమిటి?.. ఇలాంటి వివరాలు గృహగణనలో ఎన్యుమరేటర్లు తప్పనిసరిగా అడుగుతున్నారు. వీటిని విన్న ప్రజలు ఇవేమి వింత ప్రశ్నని, ఇలా ఎందుకు విసిగిస్తున్నారని తమను అదోరకంగా చూస్తున్నారని సిబ్బంది వాపోతున్నా రు. తమకు ఏమీలేవు. ఏమీ తెలియదు. తమ పి ల్లాడు లేడని, వచ్చాక రండి అని మరికొందరు స మాధానం ఇస్తున్నారు. వివరాలన్నీ రాసుకుంటే ప్ర భుత్వం నుంచి పథకాలు అందవనే సాకుతో చాలామంది అన్నీఉన్నా ఏమీ లేవని రాసుకోండని సమాధానాలు చెబుతున్నారు. మొత్తంగా జనగణన త ప్పుల తడకగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సరైన సమాచారం రాక, కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో జగణన ప్రక్రియ పక్కదారి పడుతోంది.

సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ తక్కువే

జనగణనలో ఈసారి స్వీయగణనకు అవకాశమిచ్చారు. దీంతో జిల్లాలో ఏప్రిల్‌ 26 నుంచి ఈనెల 10వ తే దీ వరకు 3శాతం మందే తమ ఇళ్ల వివరాలను వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. స్వీయగణన చేసుకున్నవారికి మెయిల్‌కు వచ్చిన సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ఐడీని భద్రపరుచుకుని ఎన్యుమరేటర్లకు దా నిని ఇవ్వాలి. కానీ చాలామంది ఐడీ ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడం, ఆ ఐడీ తెలిసిన వారు ఇంట్లో సమయానికి లేకపోవడంతో సిబ్బంది మరో సారి ఆ ఇంటికి నమోదు కోసం వెళ్లాల్సి వస్తోంది.

జిల్లాలో 1,91,510 నివాసాలు..

జిల్లాలో మొత్తం 1,548 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాకులు గుర్తించగా, ప్రతీబ్లాక్‌లో 300 నుంచి 800 మంది జనాభా ఉండనున్నారు. ఇప్పటికే పూర్తయి న సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ సహా జనగణన వర కు మొత్తం 1,91,510 ఇళ్లను లెక్కించాల్సి ఉంటుందని అంచనా వేశారు. జనగణనకు 1,152 మంది ఎన్యుమరేటర్లను నియమించగా, 10శాతం మందిని రిజర్వ్‌లో పెట్టారు. 244మంది సూపర్‌వైజర్లును నియమించారు. ఈనెల 11 నుంచి జనగణన 2027 ప్రారంభమవ్వగా, మూడురోజుల పాటు ఇళ్ల మ్యాపింగ్‌ చేశా రు. 14 నుంచి ఇంటింటికీ వెళ్లి గృహగణన ప్రారంభించి జూన్‌ 9 వరకు పూర్తిచేయాలి. మండుతున్న ఎండలు, డోర్‌లాక్స్‌, సమాచారం ఇవ్వడంలో కొందరి నిర్లక్ష్యంతో ఎన్యుమరేటర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని, సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. డిజిటల్‌ విధానంలో జరిగే ఈ ప్రక్రియలో డేటా గోప్యతకు పూర్తిభద్రత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

జనగణనలో ఎన్యుమరేటర్లకు ఇబ్బందులు

సమాచార గోప్యత పాటిస్తున్న జిల్లావాసులు

తెలిపిన సమాచారమే నమోదు చేస్తున్న సిబ్బంది

తప్పుల తడకగానే కొనసాగుతున్న గృహగణన

జిల్లా సమాచారం

ఎన్యుమరేటర్లు 1,152

సూపర్‌వైజర్లు 244

నివాసాలు 1,91,510

ఎన్యుమరేటర్‌ ప్రజల ఇళ్లలోకి వెళ్లాలి. వారికి ఇచ్చిన జాబితా ప్రకారం 33 అంశాల్లో కొన్నింటిని పరిశీలించాలి. మరికొన్ని ఇంటి యజమానిని అడిగి వివరాలు నమోదు చేసుకోవాలి. చాలాచోట్ల సిబ్బంది తూతూమంత్రంగానే ఇంటి నంబర్‌, యజమాని పేరు మాత్రమే అడిగి, వారికి నచ్చింది రాసేసుకుంటున్నారు. తప్పుడు సమాచారం నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో ప్రజలకు అందాల్సిన పథకాల విషయంలో స మస్యలు తలెత్తడంతోపాటు, ప్రజలకు అవసరమైన పథకాలు రూపొందించడంలో యంత్రాంగం విఫలమయ్యే అవకాశాలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement