రైతులు అధైర్యపడొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు అధైర్యపడొద్దు

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

ఓదెల: ధాన్యం కొనుగోళ్లలో రైతులు అధైర్య ప డొద్దని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అ న్నారు. కొలనూర్‌, ఓదెల, పొత్కపల్లిలోని ధా న్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈనెల 27లోగా మక్కలు విక్రయించాలని సూ చించారు. సర్పంచులు పల్లె కనుకయ్య, అంబా ల సారమ్మ, మంగ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఆళ్ల సుమన్‌రెడ్డి, బైరి రవిగౌడ్‌, తీర్థాల వీరన్న, పాకాల కరుణాకర్‌రెడ్డి, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.

ఆసియా క్రీడలకు చికిత

ఎలిగేడు: ఆసియా క్రీడా పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఆర్చరీ క్రీడాకారి ణి చికితకు దక్కింది. ఈఏ డాది సెప్టెంబర్‌, అక్టోబర్‌లో జపాన్‌ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ జట్లను ప్రకటించారు. మహిళల కాంషౌండ్‌ విభాగంలో మనరాష్ట్రం నుంచి సుల్తానాపూర్‌ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత ఎంపికైంది.

పర్యావరణాన్ని పరిరక్షించాలి

పెద్దపల్లిరూరల్‌: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా విద్యాధి కారి శారద సూచించారు. కాలుష్య నియంత్ర ణ మండలి ఆధ్వర్యంలో అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్‌లో మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాలుష్యంపై జాతీయ హ రితదళం జిల్లా కో ఆర్డినేటర్‌ గూళ్ల అంజన్‌ కుమార్‌ వివరించారు. విద్యార్థులకు డాన్స్‌, స్కిట్స్‌, యోగా, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు. అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పీఎం షేక్‌, హెచ్‌ఎం పురుషోత్తం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సమస్యలపై అధ్యయనం

రామగిరి: సింగరేణి కాంట్రాక్టు, పర్మినెంట్‌ కా ర్మికుల పనిపరిస్థితులు, ఒప్పంద విధానాలు, రక్షణ చర్యల గురించి లండన్‌ రీసెర్స్‌ స్కాలర్‌ హేమవైష్ణవి మంగళవారం ఆర్జీ–3 పరిధిలో అ ధ్యయనం చేశారు. ఎస్‌ఎంఎస్‌ ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశా రు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధ్యయన నివేదికను సంబంధిత వర్గాల దృష్టి కి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న, నాయకులు అశోక్‌, శ్రీనివాస్‌, రాజన్న, సంపత్‌, భూమయ్య, అంజీ పాల్గొన్నారు.

23 నుంచి రీఎగ్జామినేషన్‌

గోదావరిఖని: అనార్యోగంతో బాధపడుతున్న సింగరేణి కార్మికులకు ఈనెల 23, 24వ తేదీల్లో మెడికల్‌ రీ ఎగ్జామినేషన్‌ నిర్వహణకు యాజ మాన్యం నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ బోర్డు తో సంబంధం లేకుండా డాక్టర్లే పరీక్షలు చేస్తా రు. మొత్తం 32 మందికి మెడికల్‌ రీఎగ్జామినేషన్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏరియా లు, డిపార్ట్‌మెంట్‌ల నుంచి రెఫర్‌ చేసిన వారే అర్హులని తెలిపింది. ఈవిషయంపై సింగరేణి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కిరణ్‌ రాజ్‌కుమార్‌ మా ట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో బాధపడు తూ ఆయా ఏరియాల నుంచి కార్పొరేట్‌కు రెఫ ర్‌ అయిన వారినే పరీక్షిస్తామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఫిట్‌ పర్‌ సేమ్‌జాబ్‌, అండర్‌గ్రౌండ్‌ అన్‌ఫిట్‌, సర్ఫేస్‌ ఫిట్‌, మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ నిర్వహించే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ఫ్లైఓవర్లతో ప్రయాణం మెరుగు

ఓదెల: రైల్వే ట్రాక్‌లపై ఫ్లైఓవర్ల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. ఓదెల, కొ లనూర్‌, పొత్కపల్లి రైల్వేస్టేషన్ల సమీపంలో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం మంగళశారం స్థల పరిశీలన చేశారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు స్థలాలు పరిశీలిస్తున్నట్లు తెలిపా రు. సర్పంచులు పల్లె కనుకయ్య, కనికిరెడ్డి స తీశ్‌, అంబాల సారమ్మ, తహసీల్దార్‌ ధీరజ్‌కుమార్‌, ఎస్సారెస్పీ డీఈఈ భాస్కర్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement