పెద్దపల్లిరూరల్: విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో చాలామంది తమ ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇదే అదనుగా దొంగలు తా ళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి రాత్రివేళ చో రీలకు పాల్పడుతున్నారు. ఇళ్ల యజమానులు కనీస జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ఆటో ద్వారా జిల్లా కేంద్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రోడ్లు, ఇళ్ల ఎదుట పార్క్‌చేసిన బైక్‌లు, స్కూటీలు ఎత్తుకెళ్లడంతోపాటు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల చోటుచేసుక్ను ఘటనలే ఇందుకు నిదర్శనం.
అపరిచితుల సమాచారమివ్వండి
వీధులు, కాలనీల్లో అపరిచితులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావు సూచిస్తున్నారు. ఇళ్లవద్ద సీసీ కెమెరాలు బిగించుకుంటే మంచిదని పేర్కొన్నారు. ఇంటికి వేసిన తాళం బయటకు కనిపించకుండా పరదా అడ్డుగా ఉంచాలని సూచించారు. టూర్ వెళ్తే తమ వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చెబితే రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేసే అవకాశం ఉంటుందని వారు వివరించారు.
పెద్దపల్లిలోని భూంనగర్‌కు చెందిన ముత్యం రవీందర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఈనెల 10న తిరుపతి వెళ్లాడు. ఈనెల 12న ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి తలుపుల తాళం పగులగొట్టి ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. లోనికి వెళ్లి చూడగా నాలుగు కిలోల వెండి సామగ్రి, తులం బంగారం చోరీకి గురైనట్లు తేలింది.
సెలవుల్లో ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి విస్తృత ప్రచారం చేస్తున్న పోలీసులు


