కాల్వశ్రీరాంపూర్: రైతుల నుంచి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ విజయరమణా రావు అన్నారు. మంగపేట, జాఫర్‌ఖాన్‌పేట, వెన్నంపల్లి, కూనారంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కూనారంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, సీఈవో విజేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు
సుల్తానాబాద్‌రూరల్: మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. సుద్దాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రేగడిమద్దికుంట, హాకా, ఐకేపీ ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను విప్ ప్రారంభించి మాట్లాడారు. గతంలో రైతులకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి ముందుగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. సర్పంచులు కొదాటి సాయికిరణ్, లావణ్య పాల్గొన్నారు.
రైతుల పక్షపాతి రేవంత్‌రెడ్డి సర్కార్
ఓదెల: సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. ఓదెలలో డీసీఎమ్మెస్ మొక్కజన్న కొనుగోళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్ కనికిరెడ్డి సతీశ్, ఉపసర్పంచ్ గోపతి శ్రీలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పిట్టల రవికుమార్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తీర్థాల వీరన్న, ఏపీఎం సంపత్, మాజీ ఎంపీటీసీ బొడకుంట శంకర్ తదితరులు పాల్గొన్నారు.


