వేసవిలో ట్రాఫిక్‌ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వేసవిలో ట్రాఫిక్‌ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలి

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

● సీపీ అంబర్‌కిషోర్‌ ఝా

● సీపీ అంబర్‌కిషోర్‌ ఝా

గోదావరిఖని(రామగుండం): వేసవిలో ట్రాఫిక్‌ సిబ్బంది ఎండదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా పేర్కొన్నారు. రామగుండం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి సోమవారం కమిషనరేట్‌లోని తన చాంబర్‌లో కూల్‌ గ్లాస్‌లు పంపిణీ చేసి మాట్లాడారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా రోడ్లపై విధులు నిర్వహించే సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. విధుల పరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూ చించారు. ఎండ నుంచి రక్షణ పొందేందుకు త రచూ నీరు తాగాలని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ని బంధనలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వరరావు, ఆర్‌ఐ రమేశ్‌, ఎస్సై హరిశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

స్వీయ గణనపై అవగాహన కల్పించండి

కోల్‌సిటీ(రామగుండం): జనాభా లెక్కల స్వీయ గణన, స్వచ్ఛ సర్వేక్షణ్‌, పౌర స్పందన నమోదు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రామగుండం బల్దియా కమిషనర్‌ అరుణశ్రీ ఆదేశించారు. సోమవారం మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మెప్మా ఆర్పీలు ఇంటింటా తిరుగుతూ ఏక కాలంలో ఈ మూడు ప్రక్రియలను పూర్తి చేయడానికి అవకాశం ఉందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరం ఉత్తమ స్థానంలో నిలిచేందుకు ఎక్కువ సంఖ్యలో పౌరులు తమ ప్రతిస్పందన ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. నగరపాలక సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, మెప్మా టీఎంసీ మౌనిక పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. మండలంలోని గర్రెపల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నారాయణారావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, గర్రెపల్లి, ఐతరాజుపల్లి, భూపతిపూర్‌, బోంతకుంటపల్లిలో కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచులు స్వరూప, భాగ్యలక్ష్మి, రమేశ్‌గౌడ్‌, శ్రీరంగారావు, దీకొండ భూమేశ్‌, తిరుమల్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి అనూష, సీఈవో నబియోద్దిన్‌, మండల అధ్యక్షుడు చిలుక సతీశ్‌, నాయకులు సంపత్‌, అజయ్‌గౌడ్‌, పన్నాల రాములు, జాని తదితరులున్నారు.

గౌరవ వేతనం ఇవ్వాలి

పెద్దపల్లి: మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.13,500 గౌరవ వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పూసాల రమేశ్‌ కోరారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి సునీల్‌, నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. పాఠశాలల ప్రారంభానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం కేరళ తరహాలో గౌరవ వేతనం చెల్లిస్తే పనులకు వస్తామని, లేకుంటే నిరవధిక సమ్మెలో పాల్గొంటామన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, అటెండర్‌ మొదలుకొని సీఎం వరకు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే మార్పు వస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement