రామగుండంలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రామగుండం ఎండ వేడిమితో అగ్నిగుండంగా మారింది. సోమవారం సూరీడు తన ప్రతాపాన్ని చూపించాడు. మండుతున్న ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రామగుండంలో గరిష్టంగా 45.9, కనిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. అత్యవసర పనుల కోసం పలువురు వాహనదారులు మండుతున్న ఎండల్లో తిప్పలుపడుతూ ప్రయాణాలు సాగించారు.
– జ్యోతినగర్/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
సోమవారం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు
మండలం ప్రాంతం గరిష్టం కనిష్టం
రామగుండం మల్యాలపల్లి 45.9 32.0
సుల్తానాబాద్ సుగ్లాంపల్లి 45.9 32.0
మంథని ఎక్లాస్‌పూర్ 45.9 35.2
ధర్మారం ధర్మారం 45.8 33.0
రామగిరి కల్వచర్ల 45.7 31.5
సుల్తానాబాద్ కనుకుల 45.6 33.6
అంతర్గాం ఆకెనపల్లి 45.4 34.3
మంథని మంథని 45.1 32.7
కమాన్‌పూర్ కమాన్‌పూర్ 45.0 31.2
ఎలిగేడు ఎలిగేడు 45.0 33.2
జూలపల్లి జూలపల్లి 44.9 33.2
పాలకుర్తి ఈసాలతక్కళ్లపల్లి 44.8 33.3
పెద్దపల్లి పాలితం 44.4 32.5
ముత్తారం(మంథని) ముత్తారం 43.6 33.6


