స్వచ్ఛ సర్వేక్షణ్‌ బరిలో ‘రామగుండం’ | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ సర్వేక్షణ్‌ బరిలో ‘రామగుండం’

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

● పౌరుల నుంచి అభిప్రాయాల సేకరణ ● ఈనెల 30 వరకు గడువు

కోల్‌సిటీ: కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భా రత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దేశంలోని పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చ డం కోసండేటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక క్యూసీఐ బృందం పోటీ చేస్తున్న పట్టణాలు, నగరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆన్‌లైన్‌లో మార్కులు వేస్తారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–26’కు సంబంధించి మార్కుల జాబితా ఇప్పటికే కేంద్రం ఆయా మున్సిపాలిటీలకు పంపించింది. ఈ పోటీల్లో రామగుండం నగరపాలక సంస్థ కూడా పాల్గొంటోంది.

30 వరకు గడువు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజల అభిప్రాయాల సేకరణ కీలకం. పౌరుల అభిప్రాయాలకు 500 మార్కులు, పౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి మరో 500 మార్కులు కేటాయించారు. ఈనెల 25 నుంచి నగర ప్రజల నుంచి సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ సేకరిస్తున్నారు.

ప్రైవేట్‌ ఏజెన్సీకి బాధ్యతలు

రామగుండంలో పారిశుధ్యం మెరుగుకు ఆరునెలల క్రితం ఏకో వారియర్‌ ఏజెన్సీ అనే ప్రైవేట్‌ సంస్థకు చెందిన ముగ్గురు బృందం ప్రతినిధులను బల్దియా అధికారులు నిమమించారు. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. నెలానెలా వీరికి సుమారు రూ.2లక్షల వరకు వేతనాలు చెల్లిస్తోందని తెలిసింది. కానీ, ఆరునెలలుగా పారిశుధ్యం మెరుగు కోసం చేపట్టిన ఆనవాళ్లు మాత్రం కానరాకపోవడం విమర్శలకు తావిస్తోంది. నగరంలో స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్న బల్దియా మేయర్‌ మహంకాళి స్వామి, ఈ బృందం పనితీరుపై దృష్టిసారించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు మొక్కుబడిగా వ్యవహరించిన ఈ ప్రతినిధులు రెండు రోజులుగా హడావుడిగా విధుల్లో ఉంటుండడం గమనార్హం. గతేడాది 19,500 మంది పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మొక్కుబడిగా పని చేస్తున్న ఈ బృందం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఎలాంటి ర్యాంక్‌ను తీసుకోస్తారోనని బల్దియాలో చర్చజరుగుతోంది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వచ్చిన ర్యాంక్‌లు

సంవత్సరం ర్యాంక్‌

2024 2,016

2023 175

2022 136

2021 92

2020 211

2019 192

2018 194

2017 191

కేటాయించిన మార్కులు

సర్వీస్‌ లెవల్‌ ప్రోగ్రెస్‌(ఎస్‌ఎల్‌పీ): 10,500

వాటర్‌, ఓడీఎఫ్‌, ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌: 1,000

జీఎఫ్‌సీ రేటింగ్‌: 1,000

Advertisement
 
Advertisement
Advertisement