కోల్‌సిటీ(రామగుండం): పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా ప్రతి ఇంటా ప్రచారం చేయాలని స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు, మెప్మా ఆర్‌పీలను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. సోమవారం 48వ డివిజన్ చంద్రబాబుకాలనీ, కేసీఆర్‌కాలనీ, సాయినగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ రేణికుంట్ల నిర్మల తిరుపతితో కలిసి పర్యటించారు. బహిరంగ ప్రదేశాల్లో వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని, ఇదే పునరావృతమైతే సదరు ఇంటికి మున్సిపల్ సేవలు నిలిపివేస్తామని మేయర్ హెచ్చరించారు. ఆపత్కాలంలో అంబులెన్స్ వచ్చేలా రోడ్లు విశాలంగా ఉంచుకోవాలని స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛతలో మెప్మా ఆర్పీల పాత్ర కీలకం
స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడంలో మెప్మా ఆర్పీలు కీలకపాత్ర పోషించాలని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చెత్త బయటపడవేసే వారి ఫొటోలు తీసి మున్సిపల్ అధికారులకు పంపించాలన్నారు. స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


