అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ● ప్రజవాణిలో దరఖాస్తులు స్వీకరణ

పెద్దపల్లి: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రామగిరి మండలం కల్వచర్లకు చెందిన దిండు స్వప్న ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా, అవసరమై చర్యలు తీసుకోవాలని వారధి సొసైటీకి సూచించారు. పెద్దపల్లి పట్టణం నల్ల పోచమ్మవాడకు చెందిన రజియా బేగం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా, తగు చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ పీడీని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement