సహకార సంఘాలకు పంపిణీ చేస్తున్న మాదిరిగా యూరియా, పెస్టిసీడ్స్‌ను ఫర్టిలైజర్లకు ప్రభుత్వం పంపిణీ చేయాలి. లింకులను వెంటనే బంద్ చేయాలి. ఎమ్మార్పీకే అమ్మడం వల్ల వ్యాపారం సాగక జీవనోపాధి దెబ్బ తింటుంది.
– ఫర్టిలైజర్స్ దుకాణాదారులు
పట్టాలు ఇవ్వండి
ముత్తారం మండలం పోతారంలో 48 మంది రైతులం 50 ఏళ్లకు పైగా భూమిని సాగు చేసుకొని జీవిస్తున్నాం. మాకు ఇవ్వాల్సిన భూమిలో సాగులో లేనివారికి పట్టాలిచ్చారు. మోకాపై విచారణ చేసి సాగు చేసేవారికి పట్టాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
– పోతారం గ్రామస్తులు


