ఒకవైపు ప్రకృతి వైపరీత్యం.. మరోవైపు పశువులు, పక్షులు.. ఇంకోవైపు వన్యప్రాణులు.. కోతుల దాడులు వెరసి ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతును నిండా ముంచుతున్నాయి. అనేక కష్టనష్టాలకు ఓర్చి పంటను కాపాడుకుంటే చివరివరకు చేతికొస్తుందో? లేదో? అనే బెంగ వెంటాడుతూనే ఉంటుంది. ఈక్రమంలోనే తన పొలాన్ని కాపాడుకునేందుకు ఓ రైతు విత్ సౌండ్ సోలార్ సీసీ కెమెరాను తన వరిపొలంలో ఏర్పాటు చేసుకున్నాడు. దాని పరిసరాల్లో మనుషులు, జంతువులు, వన్యప్రాణుల జాడ కనిపిస్తే చాలు హాఠాత్తుగా శబ్దం చేస్తోంది. రైతు మొబైల్‌కు ఫొటోలూ పంపిస్తోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం అటవీ ప్రాంతంలోని పంట పొలాల్లో ఓ రైతు ఏర్పాటు చేసుకున్న సోలార్ పవర్‌తో కూడిన సీసీ కెమెరా ‘సాక్షి’కి కనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


