పెద్దపల్లి: గర్భధారణ సమయంలో తల్లి, లేదా కడుపులోని శిశువుకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తే పరిస్థితిని ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా పరిగణిస్తారని కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి గైనకాలజిస్ట్ శ్రీనయన, క్రిటికల్ కేర్ నిపుణురాలు పల్లవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, లివర్, కిడ్నీ సమస్యలు గర్భధారణ సమయంలో తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, గర్భధారణతో వచ్చే థైరాయిడ్ సమస్యలు, శిశువు బలహీనత, గర్భసంచి బలహీనత వంటి అంశాలు కూడా హైరిస్క్ కేటగిరీలోకి వస్తాయని చెప్పారు. గతంలో ఎక్కువ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హైరిస్క్ గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, ప్రతి దశలో స్కానింగ్‌లు చేయించుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. మెడికవర్ లాంటి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇలాంటి వాటికి సమగ్ర వైద్య సేవలు లభించడం వల్ల క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనవచ్చని వివరించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీశ్, సంజీవ్ పాల్గొన్నారు.


