పెద్దపల్లి: వివిధ కేసుల్లో రాజీతో కుదిరితేనే ఇరువర్గాలకు సమన్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జడ్జి మాట్లాడారు. కుటుంబ తగాదాలు, ఆస్తిగొడవలు, పిల్లల ఘర్షణలే అధికంగా ఉంటున్నాయని, వీటి పరిష్కారానికి రాజీ కుదుర్చుకోవడం ఉత్తమమన్నారు. జిల్లావ్యాప్తంగా 2,200 కేసులు రాజీ అయినట్లు వివరించారు. జిల్లా జడ్జిలు స్వప్నరాణి, మంజుల, డీసీపీ రాంరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డోంకై న రవీందర్, శ్రీనివాస్, కిశోర్, లీగల్ ఎయిడ్ సభ్యుడు మూర్తి, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు మల్లేశం, పురుషోత్తం పాల్గొన్నారు. కాగా సుల్తానాబాద్ కోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో 525 కేసులు పరిష్కారమైనట్లు జడ్జి గణేశ్ తెలిపారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, ఏజీపీ ఆంజనేయులు, లోక్ అదాలత్ సభ్యుడు మాడూరి ఆంజనేయులు, ఎస్సై చంద్రకుమార్, న్యాయవాదులు ఆవుల లక్ష్మీరాజం, వొడ్నాల రవీందర్, జోగుల రమేశ్, ఆవుల శివకృష్ణ, సామల రాజేంద్రప్రసాద్, రుద్రారపు నర్సయ్య, సంతోష్, మడూరి పృథ్వీ పాల్గొన్నారు.
ధర్మారంలో..
ధర్మారం: నందిమేడారం జూనియల్ సివిల్ కోర్టు లో చేపట్టిన లోక్ అదాలత్‌లో 211 కేసులు పరిష్కారమైనట్లు లోక్ అదాలత్ సభ్యుడు ఆకారి రాజేశం తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి సరిత ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్, లోక్ అదాలత్ సభ్యుడు నూనె సత్యనారాయ ణ, బార్ అసోసియేషన్ కోశాధికారి భీమారపు సంపత్, స్పోర్ట్స్ కార్యదర్శి ఎంపల్లి ప్రకాశ్ పాల్గొన్నారు.
రాజీ మార్గమే రాచమార్గం
గోదావరిఖనిటౌన్: రాజీమార్గమే రాచమార్గమని గోదావరిఖని మున్సిఫ్ మెజిస్ట్రేట్లు నల్లాల వెంకటసచిన్‌రెడ్డి, స్వారిక, వెంకటేశ్ దుర్వ అన్నారు. స్థానిక కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్‌లలో వారు మాట్లాడారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్, లోక్ అదాలత్ సభ్యులు సంజయ్ కుమార్, ఉమర్, కిషన్‌రావు, గుజ్జేటి సత్యనారాయణ, ముచ్చకుర్తి కుమార్, ఎంచర్ల మహేశ్, నూతి సురేశ్, సబా తబుస్సం, ప్రదీప్ కుమార్, రామటెంకి శ్రీనివాస్, ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి కుంచాల సునీత


