మంథని మున్సిపల్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

మంథని మున్సిపల్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Mar 14 2026 8:02 AM | Updated on Mar 14 2026 8:02 AM

● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని: మంథని మున్సిపల్‌ సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం మంథని మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న పాలకవర్గ సభ్యులు ప్రజలకు సేవలు అందించడంతో పాటు పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. వార్డు ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని వారి సలహాలతో ప్రణాళికలు తయారు చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. రాబోయే వేసవికాలంలో వార్డు కౌన్సిలర్లు అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నూత న పాలకవర్గ సభ్యులకు మోమోంటోలు అందజేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ సహేందర్‌రెడ్డి, కమిషనర్‌ మనోహర్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్‌ కొరతపై కేంద్రం చర్యలు తీసుకోవాలి

ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో గ్యాస్‌ కొరతపై కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథని మున్సిపల్‌ సాధారణ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్యాస్‌ కొరత తీర్చేలా ప్రధాని మోదీ, కేంద్రం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం గ్యాస్‌ నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజులు వస్తాయనే అంశాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమన్వయంతో సమస్యకు పరిష్కారం చూపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను కేంద్రానికి తెలియజేస్తున్నట్లు వివరించారు. యుద్దం కొనసాగితే ఎలాంటి ఇబ్బందులు వస్తయని ముఖ్యమంత్రితో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్ష చేశామని, రాబోయే రోజుల్లో అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement