సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Mar 14 2026 8:02 AM | Updated on Mar 14 2026 8:02 AM

● రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ ఝా

గోదావరిఖని: సైబర్‌మోసాలై అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్యాల సాధన వైపు పయనించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాల్‌లో పిల్లల భద్రత, మత్తు పదార్థాల వినియోగం–అనర్థాలు, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. మత్తు పదార్థాలకు బానిసైతే భవిష్యత్‌ నాశనం అవుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటిని సాధించే దిశగా ప్రతిఒక్కరూ కష్టపడి చదువుకోవాలని సూచించారు. యువతలో సహజంగా ఉన్న ఉత్సాహం, శక్తిని క్రీడలు, చదువు, సమాజాభివృద్ధి కోసం వినియోగించుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువత వల్లే జరుగుతున్నాయని తెలిపారు. నివేదికల ప్రకారం రోడ్డు ప్ర మాదాల్లో 60 నుంచి 70 శాతం వరకు యువకులే బాధితులవుతున్నారన్నారు. వాహనం నడిపేటప్పు డు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కారును నడిపే సమయంలో సీటుబెల్ట్‌ ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్‌, ప్రవచనకర్త ఎస్‌పీ నాయక్‌బంజారా, గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వరరావు, వన్‌టౌన్‌ ఎస్‌ఐలు రమేశ్‌, అనూష, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement