అభివృద్ధికి సహకారం అందిస్తా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి సహకారం అందిస్తా

Mar 14 2026 8:02 AM | Updated on Mar 14 2026 8:02 AM

● వార్డుల్లో నెలకొన్న సమస్యలపై దృష్టిసారించాలి ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకరిస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన మున్సిపల్‌ తొలి సమావేశంలో మాట్లాడా రు. కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. పట్టణంలోని పేదలు మరణిస్తే వారి అంత్యక్రియలకు కేవలం రూ.500లు మున్సి పాలిటీకి చెల్లిస్తే ఆ కార్యక్రమం పూర్తి చేసేలా తీర్మాణం ఆమోదించారు. ఈ విధానం దసరా నుంచి అందుబాటులోకి వస్తుందని చైర్మన్‌ మల్లయ్య తెలిపారు. ఆ లోగా విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. పట్టణంలో ప్రధాన రోడ్లు, కూడళ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం తదితర అభివృద్ధి పనుల విషయమై సమావేశంలో ప్రస్తావించారు. వేసవిలో తా గునీటికి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఎమ్మెల్యే సూ చించారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారా వును పాలకమండలి సభ్యులు సన్మానించారు. కౌన్సిలర్లను ఎమ్మెల్యే సన్మానించారు. వైస్‌ చైర్మన్‌ మస్కాన్‌ నాజ్‌ నయ్యర్‌, మేనేజర్‌ లింగయ్య, ఏఈ సతీశ్‌, టీపీవో నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement