నానో ఎరువులపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

నానో ఎరువులపై అవగాహన అవసరం

Mar 14 2026 8:02 AM | Updated on Mar 14 2026 8:02 AM

పెద్దపల్లిరూరల్‌: రైతులకు నానో ఎరువులపై అవగాహన అవసరమని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల అన్నారు. పెద్దపల్లి మండలం చీకురాయి రైతువేదికలో శుక్రవారం ఇండియన్‌ ఫార్మర్‌ ఫర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఎరువులు, డీఏపీ లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా నానో డీఏపీ, నానో యూరియా వినియోగించడం ఎంతో మేలని అన్నారు. నానో యూరియా వల్ల అధిక దిగుబడులు ఎక్కువ మోతాదులో వచ్చే అవకాశాలున్నాయనే విషయమై వివరిస్తూ నానో ఎరువులు వాడేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల సీఈవోలు పాల్గొన్నారు.

క్లిష్టమైన శస్త్రచికిత్సలకు

కేంద్రంగా జిల్లా ఆసుపత్రి

పెద్దపల్లి: క్లిష్టయమైన శస్త్రచికిత్సలకు కేంద్రంగా జిల్లా ఆస్పత్రి మారింది. శుక్రవారం పెద్దపల్లి మండలం పెద్దకల్వలకు చెందిన 51 ఏళ్ల మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ పెద్దపల్లి ప్ర భుత్వ ఆస్పత్రికి రాగా వైద్యులు ఆపరేషన్‌ చేసి గర్భసంచిలోని 3గడ్డలు, మూత్రాశయం గర్భసంచి మఽ ద్యలో ఒక పెద్ద గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు ఆస్పతి సూపరిటెండెంట్‌ శ్రీధర్‌ తెలిపారు. అలాగే చందపల్లికి చెందిన 45 ఏళ్ల మహిళ కుడి భుజంపై సుప్రాస్పినేటస్‌ టెండన్‌ పాక్షికంగా తెగి పోయిందని, ఆర్థోస్కోపిక్‌ విధానంలో కుడి భుజం సుప్రాస్పినేటస్‌ టెండన్‌ రిపేర్‌ను సుచర్‌ ఆంకర్‌తో స్థిరపర్చినట్లు వివరించారు. సర్జరీల్లో గైనకాలజిస్ట్‌ అనసూయ, ఆర్థోపెడిషియన్‌ శశికాంత్‌, వినయ్‌కుమార్‌, జనరల్‌ సర్జన్‌ విష్ణుచంద్రిక, అనెస్తీషియా కృష్ణవేణి, డాక్టర్లు స్వాతి, భవాని, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement