గోదావరిఖని(రామగుండం): సింగరేణి కార్మికుల సమస్యల సాధనకు ఉద్యమానికి సిద్ధమైనట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయి, రూ.51వేల కోట్ల బకాయిలు పేరుకపోయాయన్నారు. కార్మికులు కష్టించి పనిచేస్తున్నా సంస్థకు ఈసారి 60మిలియన్ టన్నుల కంటే ఎక్కువ లాభాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఉత్పత్తిలో అన్ని గనులు వెనకపడ్డాయని, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఉత్పత్తిపై దృష్టిసారించే వారే కరువయ్యారన్నారు. నైనీబ్లాక్‌లో 70వేల టన్నుల బొగ్గు వెలికితీసినా రవాణా లేక పేరుకుపోయిందని, బకాయిల మూలంగా ఓవర్‌డ్రాఫ్ట్ ద్వారా జీతాలు చెల్లించాల్సి వస్తోందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17 నుంచి 30వరకు సేవ్ సింగరేణి జాత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, స్వామి, వైవీ రావు, కందుకూరి రాజరత్నం, జూపాక రాంచందర్, తొడుపునూరి రమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


