ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

Mar 12 2026 7:45 AM | Updated on Mar 12 2026 7:45 AM

పెద్దపల్లి: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాల ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కోరారు. రంగా పూర్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు బుధవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ కో య శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. జూన్‌ 12వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో స ర్పంచ్‌ నుంచి మంత్రి వరకు ప్రతిఒక్కరూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పాల్గొనాలన్నా రు. పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌, పరిశుభ్రత తదితర కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. వేసవిలో తాగునీటి స మస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీ సుకోవాలని అన్నారు. కలెక్టర్‌ శ్రీహర్ష, ఎమ్మెల్యే మ క్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మాట్లాడారు. రామగుండం మహంకాళి స్వామి, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపల్‌ చైర్మన్‌లు నూగిళ్ల మ ల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, వొడ్నాల శ్రీనివాస్‌ ఉన్నారు.

నగరాభివృద్ధికి రూ.3.36 కోట్లు ఇవ్వండి

కోల్‌సిటీ(రామగుండం): నగరంలో పారిశుధ్యం ని ర్వహణ, తాగునీటి సరఫరా, వీధిదీపాల సమస్యల పరిష్కారానికి రూ.3.36 కోట్లు అత్యవసరంగా మంజూరు చేయాలని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి కలెక్టర్‌ శ్రీహర్షను కోరారు. ఈ వేసవిలో నగరవాసులకు తాగునీటి కొరత తలెత్తకుండా బోరుబావుల మరమ్మతు, కొత్తవి ఏర్పాటు చేయ డం, పైపులైన్ల లీకేజీల మరమ్మతు, కొత్త పైపులైన్ల ఏర్పాటు, వీధిదీపాల విడి భాగాలు, కొత్తవి కొనుగోలు, కూడళ్లలో మినీహైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు తదితర పనులకు ఈ నిధులు అవసరమని ఆయన వివరించారు. ఈసందర్భంగా మేయర్‌ను మంత్రి అడ్లూరి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ జ్ఞాపిక అందజేసి అభినందించారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య తదితరులు హాజరయ్యారు.

99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement