రామగిరి(మంథని): మారుతున్న సాంకేతికతకు అ నుగుణంగా విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. పన్నూర్‌లోని మంథని జేఎన్టీయూ వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ వి ష్ణువర్ధన్ అధ్యక్షతన వేడుకలు జరిపారు. మంత్రి మాట్లాడుతూ, తమ అభిరుచి, సామర్థ్యాలకు అనుగుణంగా ఉండే రంగాలను ఎంచుకుని కాలేజీల్లో చేరాలని, తద్వారా జీవితంలో విజయం సాధిస్తారన్నారు. ఉజ్వల భవిష్యత్‌కు ఉపకరించే ఇంగ్లిష్ భా షలో నైపుణ్యం సాధించాలని అన్నారు. అనంతరం టాపర్స్‌కు గోల్డ్‌మెడల్స్ అందజేశారు. వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం బ్లాక్ –2లో ఏర్పాటు చేసిన సీవీ రామన్ ఆడిటోరియాన్ని మంత్రి శ్రీధర్‌బాబు, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వర్‌రావు ప్రారంభించారు. రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మంథని జేఎన్టీయూలో టీసీఎస్ ఆయాన్ తొలిబ్యాచ్‌లో ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్, పరిపాలనాధికారి సుమన్‌రెడ్డి, ఆర్జీ–3 జీఎం మధుసూదన్, పన్నూర్ సర్పంచ్ చిందం మహేశ్, ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని, గోదావరిఖని టూటౌన్ సీఐలు రాజు, ప్రసాద్‌రావు, రామగిరి, కమాన్‌పూర్ ఎస్సైలు శ్రీనివాస్, ప్రసాద్, పీడీలు కృష్ణారెడ్డి, సునీల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యార్థులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచన


