వాస్తవానికి శిక్షణ పొందిన కార్మికులకు అన్యాయం జరిగింది. కొత్తగూడెంలోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. గుర్తింపు యూనియన్ తరఫున లేఖ రాశాం. అధికారుల తప్పిదానికి కార్మికులకు అన్యాయం చేయడం సరికాదు. కోత విధించిన డబ్బులు కార్మికులకు వాపసు చేయాలి.
– జిగురు రవీందర్, ఉపాధ్యక్షుడు, ఏఐటీయూసీ ఆర్జీ–2
సొమ్ము వాపస్ చేయాలి
అధికారుల తప్పిదం మూలంగా కార్మికులకు అన్యాయం జరిగింది. శిక్షణ రోజులన్నీ వృఽథా అయ్యాయి. ప్లేడేలు, పీహెచ్‌డీలు, అలవెన్స్ పేరుతో రూ.50వేల నుంచి రూ.లక్షకు పైగా కోత విధించారు. ఇది ఎంతమాత్రం సరికాదు. వెంటనే కోత విధించిన డబ్బులను కార్మికులకు ఇవ్వాలి. నిర్ణయం తీసుకున్న అధికారులపై చర్య తీసుకోవాలి.
– ఐలి శ్రీనివాస్,
ఉపాధ్యక్షుడు, టీబీజీకేఎస్, ఆర్జీ–2
కార్మికులకు అన్యాయం
అధికారుల తప్పిదంతో కార్మికులకు అన్యాయం జరిగింది. ఈవిషయంలో యాజమాన్యం జోక్యం చేసుకుని కోత విధించిన కార్మికుల సొమ్మును తిరిగి చెల్లించాలి. యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. కార్పొరేట్ స్థాయిలో చర్చిస్తున్నాం. సమస్య త్వరలో పరిష్కరించేలా చూస్తున్నాం.
– బదావత్ శంకర్‌నాయక్,
ఉపాధ్యక్షుడు, ఐఎన్‌టీయూసీ ఆర్జీ–2


