సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Mar 11 2026 7:21 AM | Updated on Mar 11 2026 7:21 AM

పెద్దపల్లి: ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్‌ గుండేటి ఐలయ్య యాదవ్‌ కోరారు. జి ల్లాకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం నివాళి అర్పించారు. అనంతరం హైదరాబాద్‌లో చేపట్టిన మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బస్సుల్లో తరలివెళ్లారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయని నమ్మకంతో అనేక కష్టాలు ఎదుర్కొని 13ఏళ్లపాటు ఉద్య మం నడిపామన్నారు. ఉద్యమకారులు దొబ్బడ చంద్రకళ, నూనె రాజేశం, బింగి రాజు, విజయ్‌ కుమార్‌, గోగుల రాజిరెడ్డి, చర్లపల్లి సురేశ్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, లలితాఠాగూర్‌, కందుల అశోక్‌ పటే ల్‌, జనగామ రవి, గుజ్జుల పద్మ, జ్యోతిఠాకూర్‌, మద్దెల సంజీవ్‌, కట్ల ప్రతాప్‌, గోవిందుల ఎల్లస్వామి, గుర్రాల వీరేశం, పంగ రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement