వైద్య పరీక్షలు చేసేందుకు గ్రామాలకు వెళ్లే సిబ్బందికి గ్రామస్తులు సహరించాలి. పరీక్షలు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? అనేది తెలుస్తుంది. బాధితులు అవసరాన్ని బట్టి మందులు వాడితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.
– ప్రమోద్ కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి
వినియోగించుకోవాలి
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగానే ముందుకు సాగుతోంది. ఇందుకోసం ప్రతీఒక్కరి హెల్త్ ప్రొఫైల్ త యారు చేస్తోంది. అందుకోసమే 99 రోజుల ప్రణాళికలో వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి


