పైలెట్ ప్రాజెక్టులోనే 92 మందికి ఉద్యోగాలు ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మంత్రి శ్రీధర్‌బాబు నేడు నియామకపత్రాలు అందించనున్న ‘దుద్దిళ్ల’
సాక్షి, పెద్దపల్లి/రామగిరి: మంథని జేఎన్టీయూలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ప్లేస్‌మెంట్ సక్సెస్ ప్రోగ్రామ్ విజయవంతమైంది. ఇందులో శిక్షణ పొందిన 92 మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం వారికి నియామకపత్రాలు అందజేయనున్నారు. మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడంలో హైదరాబాద్ ప్రాంతంలో చదివే విద్యార్థులతో గ్రామీణ ప్రాంతాల్లోనివారు పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేకంగా నైపు ణ్య శిక్షణ ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత ఉద్యోగావకాశాలు కల్పించే ల క్ష్యంతో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో మంథని జేఎన్టీయూలో ప్లేస్‌మెంట్ సక్సె స్ ప్రోగ్రామ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. జేఎన్టీయూ హైదరాబాద్, టీసీఎస్ అయాన్ కంపెనీలు మంత్రి సమక్షంలో గతేడాది మేలో దీనిపై అవగాహ న ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ప్లేస్‌మెంట్ సక్సెస్ ప్రోగ్రాం కింద తొలిదశలో రామగిరి మండలం సెంటినరీకాలనీ మంథని జేఎన్టీయూను పైలె ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. 100 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని టీసీఎస్ అయాన్ సంస్థ 20 వారాలపాటు నైపుణ్య శిక్షణ ఇచ్చింది. పలు సంస్థలకు అనుబంధంగా ఆయా కంపెనీల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
‘సక్సెస్ పోగ్రాం’ అంటే..
పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరం తగ్గించడం ఇందులో ప్రధానమైనది. కాలేజీ స్థాయిలోనే విద్యార్థులు దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేలా సాంకేతిక పరిజ్ఞానం అందించడం లక్ష్యమని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అకాడమీ నాలెడ్జ్‌తోపాటు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, పెరిగిన సాంకేతికను అందిపుచ్చుకునేలా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లలో విద్యార్థులను నిపుణులుగా తయారుచేయడం ప్లేస్‌మెంట్ సక్సెస్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అంటున్నారు. నైపుణ్య శిక్షణ పొందాక ఉద్యోగాల సాధనకు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవడకుండా, పట్టణ, నగర ప్రాంతవారితో పోటీపడేలా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌కు డిజైన్ చేశారు.


