ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): బీజే పీ ప్రభుత్వ నిర్ల క్ష్యంతోనే ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 70 శాత మే యూరియా ఉ త్పత్తి అవుతోంద ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు తోడవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈవిషయంపై కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. కర్మాగారంలో ఉత్పత్తి, నిర్వహణను గాడిలో పెట్టేందుకు ఢిల్లీలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ కేంద్ర కార్యాలయాన్ని తక్షణమే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామని ఎంపీ తెలిపారు.
సీఐఎస్‌ఎఫ్ సేవలు భేష్
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు భద్రతలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని ఆ సంస్థ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. మల్కాపూర్ రోడ్డులోని సీఐఎస్‌ఎఫ్ బ్యారక్స్‌లో సీఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకలు మంగళవారం నిర్వహించారు. సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. సంస్థ భద్రత, రక్షణ చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం బెస్ట్ పరేడ్ కమాండర్, బెస్ట్ ప్లాటూన్‌కు బహుమతులు ప్రదానం చేశారు. సిబ్బంది పరేడ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కమాండెంట్ చంచల్ సర్కార్, డిప్యూటీ కమాండెంట్స్ ఎస్‌ఏ రాజు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
సాగులో శాసీ్త్రయ పద్ధతులు
జ్యోతినగర్(రామగుండం): అధిక దిగుబడికి రైతులు శాసీ్త్రయ పద్ధతులు పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ సూచించారు. మేడిపల్లి రైతువేదికలో మంగళవారం రైతులకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పలు సూచనలు చేశారు. వచ్చేవానాకాలంలో బీపీటీ– 5204, తెలంగాణ సోన, కేఎన్‌ఎం–1638, జైశ్రీరామ్, హెచ్‌ఎంటీ సోనా, వరంగల్–962, 44, జగిత్యాల–1798 రకం పంటలు సాగు చేయాలని సూచించారు. ఏఈవో శ్రీకాంత్, కార్పొరేటర్ మేరుగు భూలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
94 మంది గైర్హాజరు
పెద్దపల్లి: జిల్లాలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. మొత్తం 4,829 మంది విద్యార్థులకు 4,735 మంది పరీక్షలకు హాజరయ్యారని, 94 మంది గైర్హాజరు అయ్యారని ఆమె వివరించారు. 98 శాతం హాజరు నమోదు అయ్యిందని ఆమె పేర్కొన్నారు.
13న జాబ్‌మేళా
పెద్దపల్లి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 13న కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు మంగళవారం తెలిపారు. కరీంనగర్‌లోని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌లో 20 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. డిప్లొప్లమా, బీటెక్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఆపై విద్యార్హతలు కలిగి 18– 28 ఏళ్లలోపు వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తిగలవారు ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ జిరాక్స్‌లతో కలెక్టర్‌లోని 233 రూమ్ నంబరులో సంప్రదించాలన్నారు. వివరాలకు 89853 36947, 81212 62441 ఫోన్ నంబర్లలో సంప్రదించండి.
క్వింటాల్ పత్తి రూ.7,368
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,368 ధర పలికింది. కనిష్టంగా రూ.5,424, సగటు రూ.6,909గా ధర ఉందని మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. 487 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


