‘అంగన్‌వాడీ’ల్లో వెలుగులు | - | Sakshi
Sakshi News home page

‘అంగన్‌వాడీ’ల్లో వెలుగులు

Mar 11 2026 7:21 AM | Updated on Mar 11 2026 7:21 AM

● చకచకా విద్యుత్‌ మీటర్ల బిగింపు ● వేసవిలో ఉక్కపోత నుంచి విముక్తి ● జీరో బిల్లు అమలయ్యేలా చర్యలు

మంథనిరూరల్‌: అనేక ఏళ్లుగా అరకొర వసతుల మధ్య కొనసాగిన అంగన్‌వాడీ కేంద్రాలకు ఎట్టకేలకు వెలుగులు అందుతున్నాయి. అనేక కేంద్రాలను విద్యుత్‌ సమస్య పట్టి పీడించిన విషయం తెలిసిందే. మొన్నటివరకు పక్కా భవనాలు నిర్మించినా విద్యుత్‌ సౌకర్యం లేక చిమ్మచీకట్లోనే కాలం వెళ్లదీశా రు. ఇకవేసవి వచ్చిందంటే చాలు చిన్నారులు ఉక్కపోతతో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ప్రభు త్వం ప్రతీఅంగన్‌వాడీ కేంద్రంలో విద్యుత్‌ మీటరు అమర్చి నాణ్యమైన సరఫరాకు శ్రీకారం చుట్టింది.

జిల్లావ్యాప్తంగా..

జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ మీటర్లు అమర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంథని ఐసీడీఎస్‌ పరిధిలో 196 కేంద్రాలు నడుస్తున్నాయి. మంథని, కమాన్‌పూర్‌, ముత్తారం, రామగిరి మండలాల్లో 105 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉండగా మిగతావి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

తీరనున్న ఉక్కపోత అవస్థలు

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు వేసవిలో ఉక్కపోత అవస్థలు తీరనున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే చిన్నారులు ఎండల తీవ్రతకు అవస్థల కు గురయ్యేవారు. ఒక్కోసారి ఆయాలు విసనకర్రలతో విసిరే పరిస్థితులు ఉండేవి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికష్టాలు తీరడంతోపాటు టీచర్లు, ఆయాలకూ ఉపశమనం లభించనుంది.

జీరో బిల్లు అమలయ్యేలా

అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్‌ మీటర్లు అమర్చుతున్న క్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరో బిల్లు అమలయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గృహ విని యోగదారులకు అమలు చేసే గృహజ్యోతి పథకా న్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ అమలు చేయడం ద్వారా ఇటు ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం

మంథని ఐసీడీఎస్‌ పరిధి నాలుగు మండలాల్లోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్‌ మీటర్లు అమర్చుతున్నాం. ప్రస్తుతం పక్కా భవనాల్లో పూర్తవుతోంది. కొన్నిఅద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటికి కూడా విద్యుత్‌మీటర్లు అమర్చేలా ప్రయత్నం చేస్తున్నాం.

– పుష్పలత, ఇన్‌చార్జి సీడీపీవో, మంథని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement