కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రజలకు ఇబ్బందులు రానివ్వనని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అభయం ఇచ్చారు. రూ.75 లక్షలు వెచ్చించి నిర్మించిన స్థానిక తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వర్‌రావు, రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే, కలెక్టర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, చి‘వరి’భూములకు ఈ యాసింగి పంటలకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు కలెక్టర్ సహకారంతో మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్ కృషి చేశారన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం నూతన భవనంతో స్థానిక రైతులు, ప్రజలకు మెరుగైన సేవలు వేగవంతగా అందుతాయన్నారు. ఆఫీస్‌కు అవసరమైన ఫర్నీచర్ సమకూర్చిన స్వాతంత్య్ర సమరయోధులు యెరబాటి రాజేశ్వర్, పులి దేవేందర్‌రెడ్డికి తహసీల్దార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీవో గంగయ్య, ఎంపీడీవో రామ్మోహనాచారి, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సర్పంచ్ బంగారి రమేశ్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్ పాల్గొన్నారు.


