వారం రోజులుగా తెరచుకోని సెంటర్ తలుపులు ప్రైవేట్ సీటీ స్కాన్ సెంటర్లకు రెఫర్ చేస్తున్న వైద్యసిబ్బంది జీజీహెచ్‌లో దుస్థితిపై పేషెంట్ల నిరసన
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) లో సీటీ స్కాన్ సే వలు వారం రోజులుగా నిలిచిపోయా యి. సీటీ స్కాన్ గ ది, రేడియేషన్ ప్రాంతంలోని తలుపులు, ఫర్నీచర్ చెద లు పట్టడంతో కొ త్తవి ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పనులు నత్తనడకన సాగడంతో సీటీ స్కాన్ సేవలు స్తంభించాయి.
ప్రైవేట్ సెంటర్లకు రెఫర్
సీటీ స్కాన్ కోసం వచ్చిన పేషెంట్లను కొందరు సిబ్బంది ప్రైవేట్ సెంటర్లకు రెఫర్ చేస్తున్నట్లు సమాచారం. లక్ష్మీనగర్‌లోని ఓ సీటీస్కాన్ సెంటర్‌కు వెళ్లాలని చీటీపై రాసి మరీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇది కమీషన్ల కోసమేనా? అనే అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో అందే సేవల కోసం ప్రైవేట్ సెంటర్లకు రెఫర్ చేయడంతో ఒక్కొక్కరు రూ.4,500 వరకు వెచ్చించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ చేయిస్తాం
ప్రైవేట్ సీటీ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లాలని పేషెంట్లకు చీటీ రాసి ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు. సెంటర్ తలుపులకు చెదలు పడితే కొత్తవి ఏర్పాటు చేయిస్తున్నారు. ఫర్నీచర్ పనులు పూర్తయ్యాయి. పనులతో లేచే దుమ్ము సీటీ స్కాన్ మిషన్‌లోకి వెళ్లిందని సిబ్బంది తెలిపారు. టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో పరిశీలించడానికి టెక్నీషియన్లు బుధవారం వస్తారు. మరమ్మతు పూర్తిచేసిన తర్వాత సీటీ స్కాన్ సేవలు పునరుద్ధరిస్తాం.
– డాక్టర్ కృపాభాయి,
రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్‌ఎంవో)


